రాజస్థాన్‌పై చెన్నై ఆధిపత్యం కొనసాగేనా..!

ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపబడనున్నాయి.

రాజస్థాన్‌పై చెన్నై ఆధిపత్యం కొనసాగేనా..!
Follow us

|

Updated on: Sep 22, 2020 | 12:36 PM

ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపబడనున్నాయి. ఇక రెండు జట్ల గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. చెన్నై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో సీఎస్‌కె, ఆర్ఆర్ తలపడగా.. చెన్నై 14 విజయాలు, రాజస్థాన్ 7 సార్లు మాత్రమే విజయం సాధించింది. అలాగే చెన్నై అత్యధిక స్కోర్(246), అత్యల్ప(109) రాజస్థాన్‌పైనే చేయడం గమనార్హం. (IPL 2020)

పిచ్ రిపోర్ట్: దుబాయ్, అబుదాబి పిచ్‌ల కంటే షార్జా పిచ్ పూర్తి విభిన్నంగా ఉంటుంది.. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌దే హవా. బౌలర్లకు కఠినమైన సవాల్ ఎదుర్కునే ఈ పిచ్‌పై ఖచ్చితంగా ఇవాళ హైస్కోరర్ గేమ్ జరగనుందని చెప్పొచ్చు.

రాజస్థాన్: క్వారంటైన్ నిబంధనల నేపధ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌కు జోస్ బట్లర్ దూరం కానున్నాడు. అటు బెన్ స్టోక్స్‌ కూడా టీంకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే టామ్ కరన్, డేవిడ్ మిల్లర్‌లకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది.

జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, ఉతప్ప, స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, సంజూ శాంసన్, టామ్ కరన్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, ఆర్చర్, ఉనద్కట్, రాజపూత్/వరుణ్ ఆరోన్/కార్తీక్ త్యాగి

చెన్నై: మొదటి మ్యాచ్‌ విజయంతో.. చెన్నై జట్టుకు ఈ మ్యాచ్‌కు పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ కరోనా నెగటివ్ రావడంతో నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే అతడు ఈ మ్యాఛ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది క్లారిటీ లేదు.

జట్టు (అంచనా): మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, రాయుడు, జాదవ్, ధోని(కెప్టెన్), జడేజా, సామ్ కరన్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, ఎంగిడి

ఐపీఎల్ చరిత్రలోనే ధోని(65.5%), స్మిత్‌(60%)లు మోస్ట్ సక్సస్‌ఫుల్ కెప్టెన్స్. ఇక 2018లో పునరాగమనం తర్వాత చెన్నై కెప్టెన్ ధోని దాదాపు 22 సార్లు టాస్ గెలవడం జరిగింది. ఇక గతేడాది డెత్ ఓవర్లలో(16-20) రాజస్థాన్ రాయల్స్ అత్యధిక పరుగులు సమర్పించుకుంది. మరి చూడాలి ఈ రెండు జట్ల మధ్య పోరు ఎలా ఉండబోతోందో.!

Also Read: ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఢిల్లీ ఖాతాలో అరుదైన రికార్డు..