మలింగ మళ్లీ ఐపీఎల్‌లో ఆడకపోవచ్చంటున్న చోప్రా

ఐపీఎల్‌లో స్టార్‌ ప్లేయర్లు ఉంటేనే ఎంటర్‌టైన్మెంట్‌.. లేకపోతే బోరే! ముంబాయి జట్టు నుంచి శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ తప్పుకోవడం చాలా మందిని నిరాశపర్చింది.. వ్యక్తిగత కారణాలతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో జరగబోతున్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు మలింగ దూరమయ్యాడు..

మలింగ మళ్లీ ఐపీఎల్‌లో ఆడకపోవచ్చంటున్న చోప్రా
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 04, 2020 | 6:50 PM

ఐపీఎల్‌లో స్టార్‌ ప్లేయర్లు ఉంటేనే ఎంటర్‌టైన్మెంట్‌.. లేకపోతే బోరే! ముంబాయి జట్టు నుంచి శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ తప్పుకోవడం చాలా మందిని నిరాశపర్చింది.. వ్యక్తిగత కారణాలతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో జరగబోతున్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు మలింగ దూరమయ్యాడు.. మలింగ తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేదు.. ఆయనకు సర్జరీ జరిపించాల్సి వుంది.. నాన్నను చూసుకోవడం కోసమే మలింగ ఐపీఎల్‌ను కాదనుకున్నాడు.. అయితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మళ్లీ మలింగ ఆడకపోవచ్చంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా. ఇదే పక్కా అని తాను చెప్పడం లేదు కానీ.. అలా అనిపిస్తోందని చోప్రా చెప్పుకొచ్చాడు.. మలింగ లేకపోతే ఐపీఎల్‌లో మజానే ఉండదని చెప్పిన చోప్రా ..మలింగకు అంతా శుభమే జరగాలని కోరుకున్నాడు. 2009 నుంచి ఐపీఎల్‌లో మలింగ పార్టిసిపేట్‌ చేస్తూ వస్తున్నాడు. మధ్యలో రెండు సీజన్‌ల పాటు బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు.. లాస్ట్‌ సీజన్‌లో మళ్ల టీమ్‌లోకి వచ్చిన మలింగ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. ఫైనల్‌ ఓవర్‌ వేసిన మలింగ అద్భుతంగా బౌలింగ్‌ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబాయి ఇండియన్స్‌ జట్టు తరఫున 122 మ్యాచ్‌లు ఆడిన మలింగ 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసుకున్నాడు.. ఐపీఎల్‌లో ఇన్నేసి వికెట్లను తీసుకున్న బౌలర్‌ మలింగనే! 2016, 2018 సీజన్‌లలో ఎందుకో తెలియదు కానీ బౌలింగ్ కోచ్‌గా మారాడు.. మళ్లీ 2019 సీజన్‌లో టీమ్‌లో సభ్యుడయ్యాడు..