యాపిల్ ఐఫోన్ 11 వచ్చేసింది…!

iPhone 11 With Dual Rear Cameras Apple A13 Bionic SoC Liquid Retina Display Launched, యాపిల్ ఐఫోన్ 11 వచ్చేసింది…!

యాపిల్ ఐఫోన్ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో జరిగిన స్పెషల్ ఈవెంట్‌లో బ్రాండ్ న్యూ ఐఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. ఈ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కాకముందే స్పెసిఫికేషన్స్ గురించి చాలా లీకులొచ్చాయి. ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ఆన్‌లైన్‌లో ప్రచారం జరిగినట్టుగానే ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది.

ఐఫోన్ 11 డ్యూయెల్ కెమెరా ఫోన్ కాగా, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ట్రిపుల్ కెమెరా ఫోన్లు. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఐఫోన్ 11 సిరీస్ ప్రారంభ ధర రూ.64,900. ఇండియాలో సెప్టెంబర్ 27న సేల్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *