మందుకొట్టి ఆపై తుపాకి గురిపెట్టి.. ఢిల్లీలో మహిళ హల్‌చల్..మొబైల్ షాప్ యజమానికి షాక్ మీద షాక్

ఢిల్లీలో బురఖా ధరించి మద్యం సేవించిన ఓ మహిళ తుపాకీతో హల్‌చల్.. చేసింది. ఓ మొబైల్ షాప్ యజమానిని బండ బూతులు తిడుతూ, తుపాకితో గాల్లో కాల్పులు జరుపుతూ వీరంగం స‌ృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • uppula Raju
  • Publish Date - 4:58 pm, Tue, 24 November 20

ఢిల్లీలో బురఖా ధరించి మద్యం సేవించిన ఓ మహిళ తుపాకీతో హల్‌చల్.. చేసింది. ఓ మొబైల్ షాప్ యజమానిని బండ బూతులు తిడుతూ, తుపాకితో గాల్లో కాల్పులు జరుపుతూ వీరంగం స‌ృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈశాన్య ఢిల్లీలోని చౌహాన్ బంగ్రా ప్రాంతంలో ఈ నెల 18న ఈ వివాదం జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

జఫ్రబాద్‌కు చెందిన నుస్రత్ అనే మహిళ మొబైల్ ఫోన్‌కు సంబంధించి ఓ షాప్ యజమానితో గొడవ పడింది. అయితే పుల్‌గా మందు కొట్టి ఉన్న నుస్రత్ షాపు ఓనర్‌ను బండ బూతులు తిడుతూ గన్‌తో బెదిరించింది. అంతేకాకుండా షాపు బయట కాల్పులు కూడా జరిపింది. తాను గ్యాంగ్‌స్టర్ నసీర్ సిస్టర్‌ని అంటూ అక్కడున్న వారందరికి గన్‌ చూపెడుతూ బెదిరించింది. ఈ సంఘటన స్థానికంగా అందరిని భయ బ్రాంతులకు గురి చేసింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నుస్రత్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.