Breaking News
  • హైదరాబాద్‌: తార్నాకలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ సదస్సు. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.
  • ప్రకాశం జిల్లా మార్టూరుకు బయల్దేరిన చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు.
  • కడప: రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.
  • వరంగల్‌లో వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ గోదావరి యాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రైతులతో సమావేశం. గోదావరి జలాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు.
  • అమరావతి: చంద్రబాబు భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు-యనమల రామకృష్ణుడు. ఈ విషయంపై మండలిలో చర్చిస్తాం. అవసరమైతే ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం-యనమల రామకృష్ణుడు.
  • నిర్మల్‌: మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు. మంత్రితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం బాపూరావు.

నిత్యానంద ఏడీ ? ఎక్కడున్నాడు ? ఇంటర్‌పోల్ నోటీసు జారీ

Nithyananda claims to be the spiritual head of the Madurai Adheenam mutt in Tamil Nadu, నిత్యానంద ఏడీ ? ఎక్కడున్నాడు ? ఇంటర్‌పోల్ నోటీసు జారీ

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, తనను గాడ్ మ్యాన్ గా చెప్పుకునే నిత్యానంద స్వామి ఆచూకీ కోసం ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది. రేప్, లైంగిక వేధింపుల వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న నిత్యానంద గత ఏడాది ఇండియా నుంచి పరారైన సంగతి తెలిసిందే. నిందితుడైన ఇతని ఆచూకీ కనుగొనడంలో గానీ, ఇతనికి సంబంధించిన సమాచారం గానీ తెలియజేసి తమకు తోడ్పడవలసిందిగా గుజరాత్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. ఎక్కడో అజ్ఞాత ప్రదేశం నుంచి తలాతోకా లేని ప్రకటనలతో కూడిన ఇతని వీడియోలు ఆ మధ్య కాస్త సంచలనం రేపాయి. నిత్యానంద తమ దేశంలో లేడని  ఈక్వెడార్ ప్రకటించింది. తనకు ఇక్కడ ఆశ్రయం కల్పించాలన్న అతని కోర్కెను ఆ దేశం తోసిపుచ్చింది. తానొక దీవిని కొనుక్కున్నానని నిత్యానంద చేసిన వ్యాఖ్యలను కూడా ఈక్వెడార్ ఖండించింది. కొందరు అమ్మాయిలను కిడ్నాప్ చేసి అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో వారిని బందీలుగా చేశాడన్న ఆరోపణలను పురస్కరించుకుని గుజరాత్ పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. రేప్ ఆరోపణల నేపథ్యంలో 2010 లో నిత్యానందను హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక నటితో ఇతగాడు సన్నిహితంగా ఉన్న ఫుటేజీ బయటపడిన విషయం గమనార్హం.

గత డిసెంబరులో ప్రభుత్వం నిత్యానంద పాస్‌పోర్టును రద్దు చేసింది. ఇతని ఆచూకీని కనుగొనడంలో సాయపడాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఆ మధ్య విదేశాల్లోని రాయబార కార్యాలయాలను కోరారు. తనను ఎవరూ టచ్ చేయలేరని, ఎవరూ ప్రాసిక్యూట్ చేయలేరని నిత్యానంద చెప్పుకుంటూ వచ్చాడు. పైగా తను పరమశివుడినని,  తనది కైలాసమని, ఇదో పెద్ద హిందూ దేశమని కోతలు కోశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో గానీ ఇంటర్‌పోల్ నోటీసు జారీ అయింది గనుక ఇతని ఆచూకీ ఇప్పటికైనా దొరుకుతుందేమో చూద్దాం.

 

 

Related Tags