Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

ఇంటర్నెట్ ప్రోటోకాల్ ముఠా గుట్టు రట్టు

Internet Protocol gang arrested, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ముఠా గుట్టు రట్టు

కడప జిల్లాలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ దందా మూడు కాల్స్..ఆరు రింగులుగా సాగుతోంది..రాజంపేట పట్టణంలో అధికారుల కళ్లుగప్పి రెండేళ్లుగా కోట్ల రూపాయలు గడించిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అడ్డదారిలో అంతర్జాతీయ ఫోన్ కాల్స్ దందా నడుపుతున్నముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 500 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాఉట చేసిన పట్టణ సీఐ శుభ కుమార్ వివరాలు వెల్లడించారు.
ఇతర దేశాలకు వెళ్లిన వారు ఇక్కడి వారితో మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడాలనుకుంటే ప్రభుత్వానికి నిమిషానికి 32 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించే అవసరం లేకుండా ప్రభుత్వం కళ్లు గప్పి అడ్డదారిలో అంతర్జాతీయ కాల్స్ మాట్లాడినందుకు కొంతమంది పథకం వేశారు. ఇందులో భాగంగా విదేశాలలో ఉన్న కొందరు స్థానికంగా కొంతమంది తమ ప్రతినిధులుగా నియమించుకున్నారు. ఇంటర్‌నెట్‌ ద్వారా ఫోన్లు చేస్తే ఇక్కడ ఉన్న వారి పరికరం తో అనుసంధానం అయ్యేలా చేశారు. అక్కడ నుంచి ఇంటర్నెట్ ద్వారా ఫోన్ వచ్చినా, స్థానికులకు మాత్రం లోకల్ నెంబర్ ద్వారా వచ్చినట్లు కనిపించేలా ఈ విధానాన్ని రూపొందించారు. ఈ క్రమంలో ఆయా దేశాలలో దాదాపు 500 మంది ప్రతినిధులను ఎంచుకున్నారు. విదేశాలలో ఉన్న వారు తమ బంధువులు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అక్కడి ప్రతినిధులను సంప్రదిస్తారు. వారు ఇంటర్‌నెట్‌ ద్వారా ఇక్కడున్న వారికి కాల్ చేస్తారు. ఇక్కడ ఉన్నవారి ప్రతినిధులు లోకల్ నెట్‌వర్క్‌ ద్వారా ఇక్కడి వారికి కాల్ కనెక్ట్ చేసి మాట్లాడిస్తారు. ఇందుకు ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తారు.
దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ఈ తతంగాన్ని ముందుగా హర్యానా లో ఉన్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రధాన కార్యాలయం అధికారులు గుర్తించారు. అన్ని ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని రాజంపేట ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ కాల్స్ వెళ్తున్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. పట్టణంలోని రెడ్డి వారి వీధికి చెందిన లక్ష్మీనారాయణ తన ఇంటి పై నిర్వహిస్తున్న కేంద్రం ద్వారా ఎక్కువ కాలం మాట్లాడుతున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తనిఖీ చేసిన పోలీసుఉల….500 సిమ్ కార్డు వినియోగించి రెండున్నర లక్షల చొప్పున కట్టినట్లు వివరించారు. లక్ష్మీనారాయణ సహాయకుడు మున్నాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ శుభకుమార్‌ తెలిపారు.