విదేశీ విమాన సర్వీసులపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..రేపటి నుంచే!

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన విదేశీ విమాన స‌ర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. అందుకు సంబంధించి మూడు దేశాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయ‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.

విదేశీ విమాన సర్వీసులపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..రేపటి నుంచే!
Follow us

|

Updated on: Jul 16, 2020 | 5:48 PM

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన విదేశీ విమాన స‌ర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. అందుకు సంబంధించి మూడు దేశాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయ‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరీ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌.. ఈ మేరకు వెల్లడించారు.

అమెరికా, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీలతో చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ వెల్లడించారు. అమెరికా రేప‌టి(శుక్రవారం) నుంచి, ఫ్రాన్స్ ఎల్లుండి(శనివారం) నుంచి భార‌త్‌కు విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు ఆ దేశాలు అంగీక‌రించాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ నెల 18 నుంచి ఆగ‌స్టు 1 వ‌ర‌కు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు మ‌ధ్య ఎయిర్ ఫ్రాన్స్ 28 విమానాల‌ను న‌డ‌ప‌నుంద‌ని వెల్ల‌డించారు. ఈ నెల 17 నుంచి 31 వ‌ర‌కు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ భార‌త్ – అమెరికా మ‌ధ్య‌ 18 విమానాల‌ను న‌డిపేందుకు ఒప్పందం జ‌రిగింద‌ని కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. జ‌ర్మ‌నీతో కూడా విమాన స‌ర్వీసుల‌పై సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వ‌చ్చినట్లుగా మంత్రి హర్ దీప్ సింగ్ స్పష్టం చేశారు.

[svt-event date=”16/07/2020,5:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]