Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

కమలాకర్ష్‌కు సొంతింటి షాక్.. బ్రేకేస్తున్న ఆ ఇద్దరు ?

bjp internal back stabbing, కమలాకర్ష్‌కు సొంతింటి షాక్.. బ్రేకేస్తున్న ఆ ఇద్దరు ?

ఏపీ బిజెపి అధ్యక్షునికి కొత్త చిక్కొచ్చిపడింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆశించిన స్పందన లేకపోవడంతో లోతులకు వెళ్ళిన ఏపీ బిజెపి నాయకత్వానికి షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం. దాంతో ఢిల్లీలోనే తేల్చుకోవాలన్న నిర్ణయానికి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వచ్చినట్లు తెలుస్తోంది.

ఏడాది క్రితం వరకు ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రమే. కానీ.. మొన్నటి ఎన్నికల తర్వాత ఏపీలో బిజెపి పుంజుకోవడం మొదలైంది. మారిన ఏపీ రాజకీయాలు దానికి ఒక కారణమైతే.. కేంద్రంలో బిజెపి బలమైన శక్తిగా ఎదిగిపోవడమే ఇంకో కారణం. సంఖ్యాబలంలోను.. రాజకీయ బలంలోను.. ప్రభుత్వంలో వుండడం వల్లను.. బిజెపికి ఏపీలో వేళ్ళూనుకోవాలన్నఆకాంక్షకు అనుకూల వాతావరణం కనిపించింది. దానికి తోడు అయిదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చోలేని రాజకీయ నాయకుల సంఖ్య పెరిగి పోవడం కూడా బిజెపికి కలిసి వచ్చేలా చేసింది. ఫలితంగా ఏపీలో బిజెపి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు భారీగా స్పందన వుందన్న కథనాలొచ్చాయి.

సార్వత్రిక ఎన్నికలు అలా ముగిసాయో లేదో.. టిడిపికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు చంద్రబాబుకు హ్యాండిచ్చి బిజెపిలో విలీనమైపోయారు. వారిలో సుజనా చౌదరి బిజెపిలో కీలకంగా మారిపోయారు కూడా. అదే ఊపులో పలువురు టిడిపి, కాంగ్రెస్ నేతలు బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరిగింది. తొలుత జేష్ట్య మాసం ముగిసాక శ్రావణ మాసంలో కమలాకర్ష్‌కు భారీ స్పందన వుంటుందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత వినాయక చవితి, దసరా, దీపావళి..ఇలా వాయిదాల మీద వాయిదాలు వస్తూ వెళుతూ వుండడం జరిగిపోయింది. కానీ బిజెపి నేతలు క్లెయిమ్ చేసుకున్న నేతలు మాత్రం కమలం పార్టీలోకి రాలేదు.

అయితే.. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పలువురి ఇతర పార్టీల నేతలతో చర్చలు జరిపి ఒప్పిస్తున్నా.. ఆ తర్వాత వారు మొహం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కారణం బిజెపిలో ఇటీవల చేరిన ఇద్దరు నేతలేనన్న నిర్ధారణకు బిజెపి నాయకత్వం వచ్చినట్లు సమాచారం. గంటా శ్రీనివాస్ రావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కరణం బలరామ్ ఇలా పలువురు బిజెపిలో నేడో, రేపో చేరతారన్న ప్రచారం జరిగింది. కానీ వీరెవరూ ఇంత వరకు బిజెపి తీర్థం పుచ్చుకోలేదు. కమలం కండువా కప్పుకోలేదు. ఒక దశలో 16 మంది టిడిపి ఎమ్మెల్యేలు, దాదాపు అంతే సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు బిజెపికి టచ్‌లో వున్నారని బిజెపి నేతలు ఆంతరంగిక భేటీల్లో చెప్పుకున్నారు. అయితే వీరిలో ఒక్కరూ బిజెపిలో చేరలేదు.

కారణమేంటా అని బిజెపి ఏపీ అధ్యక్షుడు మధన పడుతూ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించినట్లు సమాచారం. దాంతో వారు అనుమానమొచ్చిన కొందరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా పార్టీ రాష్ట్ర స్థాయి కోర్ కమిటీలో ఓపెన్‌గానే చేరికలపై చర్చించిన కన్నా.. ఆ తర్వాత వాటిని సీక్రెట్‌గా తానే స్వయంగా డీల్ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దాంతో కన్నా మూవ్ మెంట్‌పై, ఆయన్ను కలుస్తున్న నేతలపై మరికొందరు కన్నేశారని తెలుస్తోంది. ఈ రకంగా ఏపీ బిజెపిలో ఇంటి వ్యక్తులే కొత్త వారి రాకను అడ్డుకుంటున్నట్లు వెల్లడైందని తెలుస్తోంది.

bjp internal back stabbing, కమలాకర్ష్‌కు సొంతింటి షాక్.. బ్రేకేస్తున్న ఆ ఇద్దరు ?

 

విశ్వసనీయ సమాచారం ప్రకారం కన్నాకు వచ్చిన నివేదికలో విస్తుపోయే విషయాలున్నాయని తెలుస్తోంది. బిజెపిలోకి రావాలనుకుంటున్న వారిని వారిస్తోంది ఎవరో కాదు.. మొన్నటి ఎన్నికల తర్వాత బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లేనని కన్నాకు సమాచారమందిందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే తాను ఒప్పించిన నేతలు తర్వాత తనకు మొహం చాటేస్తున్నారని కన్నా ఆగ్రహంతో వున్నారని తెలుస్తోంది. తన శ్రమ అంతా వృధా అవుతుందన్న ఫీలవుతున్నారని సమాచారం.

ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక రూపొందించిన తర్వాత బిజెపి అధినేతలు అమిత్ ‌షా, జె.పి.నడ్డాలను కలిసేందుకు కన్నా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సో.. పార్టీ ఎదగ ముందే ఇంటిపోరుతో కమలం పార్టీకి కుదేలవుతుందన్న మాట. ఇది ఆధిపత్య పోరా లేక చంద్రబాబు డైరెక్షన్‌లోజరుగుతున్న వెన్నుపోటా అన్నది కమలం నేతలకు అంతు చిక్కడం లేదని సమాచారం.