Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 45 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 145380. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 80722. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 60491. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4167. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.
  • ఆర్‌పిఎఫ్ సిబ్బంది కి కరోనా పాజిటివ్. లూధియానా లోని రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 7 మంది ఆర్‌పిఎఫ్ సిబ్బంది కి కరోనా పాజిటివ్. సుమారు 100 మంది సిబ్బందిని హోమ్ క్వారం టైన్ కి పంపించిన అధికారులు. డైరెక్టర్ జనరల్ (డిజి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.
  • లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు చేయుత. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 14 వేల మంది సినీ కార్మికులకు, టెలివిజన్ కార్మికులకు సొంత ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం.
  • అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 8 మంది సభ్యులతో కమిటీ వేయాలని మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్ లో తెలిపిన దీపక్ రెడ్డి. నేడు విచారణ జరపనున్న హైకోర్టు.
  • అమరావతి: రాష్ట్రంలో నగలు, బట్టలు, చెప్పులు షాపులు తెరిచేందుకు అనుమతి. స్ట్రీట్ ఫుడ్స్ కి సైతం అనుమతి మంజూరు . అనుసరించాల్సిన విధానాల పై సర్కులర్ జారీ . పెద్ద షో రూమ్ కు వెళ్లాలంటే ముందే ఆన్లైన్ లో అనుమతి తప్పనిసరి. అన్ని షాపులో ట్రైల్ రూము లకి అనుమతి నిరాకరణ . పాని పూరి బండ్లకు అనుమతి నిరాకరణ.

క్రేజీ కాంబో.. ఇంట్రస్టింగ్ టైటిల్..!

Balakrishna movie, క్రేజీ కాంబో.. ఇంట్రస్టింగ్ టైటిల్..!

యువ హీరోలందరితోనూ దాదాపుగా సినిమాలను చేసేసిన సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు సీనియర్ల వైపు కూడా మొగ్గుచూపతున్నాడు. ఇప్పటికే వెంకటేష్‌తో ‘ఎఫ్ 2’ను చేసేసిన రాజు.. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు గానీ.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు మాత్రం అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి.

కాగా హిందీలో విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌ తెలుగు రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తుండగా.. ఈ మూవీని బాలయ్యతో చేయాలనుకుంటున్నాడట రాజు. అందులో అమితాబ్ కారెక్టర్‌ బాలయ్యతో చేయించాలన్న పట్టుదలతో ఈ నిర్మాత ఉన్నాడట. దీనికి సంబంధించి బాలకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం లాయర్ సాబ్ అనే టైటిల్‌ కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీకి బోని కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే పింక్ మూవీని ఇటీవలే తమిళ్‌లో రీమేక్ చేశారు. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రం ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్‌తో వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విద్యా బాలన్, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు కీలక పాత్రలలో నటించగా.. బోని కపూర్ నటించారు. ఈ మూవీపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Related Tags