మారుతితో సాయితేజ్.. ‘ప్రతీ రోజు పండగే’

‘చిత్రలహరి’ సినిమాతో మంచి విజయం అందుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ ప్రస్తుతం దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘ప్రతీ రోజు పండగే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రెజీనా కసండ్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *