పొరపాట్లు నిజమే..చర్యలు తీసుకుంటాం- ఇంటర్‌ బోర్డు

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ అంగీకరించారు. ఇంటర్‌ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యతతో కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు.  ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని, ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా బోర్డే ఇంటర్‌ పరీక్షలను చేపట్టే ప్రక్రియలో భాగంగానే గ్లోబరీనా టెక్నాలజీ అనే సంస్థ సేవలు తీసుకున్నామని వెల్లడించారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాల […]

పొరపాట్లు నిజమే..చర్యలు తీసుకుంటాం- ఇంటర్‌ బోర్డు
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2019 | 6:41 PM

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ అంగీకరించారు. ఇంటర్‌ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యతతో కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు.  ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని, ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా బోర్డే ఇంటర్‌ పరీక్షలను చేపట్టే ప్రక్రియలో భాగంగానే గ్లోబరీనా టెక్నాలజీ అనే సంస్థ సేవలు తీసుకున్నామని వెల్లడించారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాల వెల్లడిలో అవకతవకలు, ఇంటర్‌ విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో సోమవారం  విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల శ్రేణులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు ఇంటర్‌ బోర్డు ముందు పెద్ద ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఇంటర్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అక్కడక్కడ కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని, ముఖ్యంగా ముగ్గురు విద్యార్థుల పరీక్షా పత్రాలకు సంబంధించి మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని చెప్పారు.  మూల్యాంకనంలో తప్పులు, పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పొరపాటు చేసిన వారిని ఇప్పటికే వివరణ అడిగామని, వారికి చార్జ్‌మెమో కూడా ఇస్తామని స్పష్టం చేశారు.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!