ఇన్‌స్టాగ్రామ్‌లోకి కొత్త ఫీచర్.. ఏంటో తెలుసా..!

Instagram Music now available in India, ఇన్‌స్టాగ్రామ్‌లోకి కొత్త ఫీచర్.. ఏంటో తెలుసా..!

యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న ప్రముఖ ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. యూజర్లు ఇక నుంచి తమకు నచ్చిన పాటల్ని స్టోరీస్‌తో జోడించే విధంగా కొత్త ఆప్షన్‌ను తీసుకువచ్చింది. గతేడాది మార్చిలోనే ఇన్‌స్టాగ్రామ్‌ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అప్పుడు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం భారత్‌లో కూడా అప్‌డేట్‌తో ఈ ఫీచర్‌ను పొందవచ్చు. స్టోరీస్‌ ఆప్షన్‌లోకి వెళ్లి స్టిక్కర్స్‌ బటన్‌ నొక్కితే ఈ ఫీచర్‌ కనిపిస్తుంది. ఒకవేళ ఆ ఆప్షన్ కనిపించకపోతే.. ఒకసారి యాప్‌ను డిలీట్‌ చేసి మళ్లీ ఇన్‌స్టాల్‌ చేస్తే దాన్ని పొందవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఈ మ్యూజిక్‌లో పాపులర్‌ సాంగ్స్‌, మోడ్స్‌, జెనర్స్‌ ఇలా మూడు రకాల సదుపాయాలు ఉంటాయి. వాటి ద్వారా యూజర్లు తమకు నచ్చిన పాటల్ని బ్రౌజ్‌ చేసి స్టోరీస్‌కు యాడ్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *