ఈ కామర్స్ రంగంలోకి ‘ఇన్‌స్టాగ్రామ్’

ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా ఈ కామర్స్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈకామర్స్‌ వ్యాపారం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌ యాజమాన్యం యోచిస్తోంది. ఇందుకుగాను వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్ ఉత్పత్తులు కొనుగోలు చేసుకునేలా ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో షాపింగ్‌ ఫీచర్‌ను జోడించింది. ప్రస్తుతం బీటా వెర్షన్‌తో ‘చెక్అవుట్’ బటన్‌తో కూడిన యాప్‌ను అమెరికాలో లాంచ్‌ చేసినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఈ బీటా యాప్‌ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఉత్పత్తులను అప్పటికప్పుడు డబ్బు చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు. దిగ్గజ‌ బ్రాండ్లుగా గుర్తింపు పొందిన […]

ఈ కామర్స్ రంగంలోకి 'ఇన్‌స్టాగ్రామ్'
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 12:06 PM

ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా ఈ కామర్స్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈకామర్స్‌ వ్యాపారం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌ యాజమాన్యం యోచిస్తోంది. ఇందుకుగాను వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్ ఉత్పత్తులు కొనుగోలు చేసుకునేలా ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో షాపింగ్‌ ఫీచర్‌ను జోడించింది. ప్రస్తుతం బీటా వెర్షన్‌తో ‘చెక్అవుట్’ బటన్‌తో కూడిన యాప్‌ను అమెరికాలో లాంచ్‌ చేసినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

ఈ బీటా యాప్‌ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఉత్పత్తులను అప్పటికప్పుడు డబ్బు చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు. దిగ్గజ‌ బ్రాండ్లుగా గుర్తింపు పొందిన ఆడిడాస్, బుర్బెర్రీ, డియోర్, హెచ్‌ అండ్‌ ఎం, నైక్, ఆస్కార్ డి లా రెంటా, ప్రాడా, వార్బీ పార్కర్ లాంటి పరిమిత బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి అమెరికాలో పరిమిత సంఖ్యలో వ్యాపార సంస్థలకు దీనిలో అవకాశం ఇచ్చింది. వినియోగ‌దారుడి మొట్టమొదటి కొనుగోలుసమాచారం భవిష్యత్తులో ఉపయోగం కోసం నమోదు చేయబడుతుంది, అని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.