ఏపీ : వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో  వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Ram Naramaneni
  • Publish Date - 8:15 pm, Mon, 26 October 20

జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో  వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నష్టపోయిన వ్యవసాయ పంటలకు 113 కోట్లు, ఉద్యాన పంటలకు 22 కోట్ల రూపాయల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 33 శాతానికంటే ఎక్కువగా దెబ్బ తిన్న పంటలకు సబ్సిడీ విడుదలైంది.  ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, విశాఖ జిల్లాల్లోని రైతులకు సబ్సిడీ విడుదల చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు జరపాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో భారీ వర్షాలతో కురవడంతో  గోదావరి, కృష్ణా, కుందూ నదుల వరదలతో పోటెత్తాయి. వీటి ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మేరకు పంట నష్టంపై అధ్యయనం చేసిన ప్రభుత్వం నివేదిక మేరకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేసింది.

Also Read :

ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును