Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • నిమ్స్ డైరెక్టర్ మనోహర్. నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఐసీఎంఆర్ వాక్సిన్ ట్రయిల్ నిమ్స్ అసూపత్రిని ప్రకటించారు. 7వ తేదీ నుంచి క్లినిక్ ల ట్రయిల్ ప్రారంభిస్తాం. ఫేస్ 1,ఫేస్ 2 కిందా నిమ్స్ ఆసుపత్రిలో ఈ క్లినిక్ ల ట్రైల్స్ జరుగుతాయి. క్లినిక్ ల ట్రయిల్ భాగస్వామ్యం కావడం కోసం ముందుకు వస్తున్నారు,నిన్నటి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయ్. వాక్సిన్ తీసుకొనే వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తాం. పరిశీలించిన తరవాత పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుంది . వాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 రోజులు ఆసుపత్రి అడ్మిట్ చేస్తాం ,ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తాం.
  • నల్లగొండ: రాంగోపాల్ వర్మ నిర్మించబోయే మర్డర్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి బాలస్వామి. సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు .దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు. రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కోర్టు.
  • యాదాద్రి: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత భర్త, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారించిన డాక్టర్లు. నిన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు, ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ.

టీమిండియాకు షాక్.. రోహిత్‌కు గాయం..

Ind vs Bangla: Rohit Sharma gives Men in Blue injury scare ahead of 1st T-20, టీమిండియాకు షాక్.. రోహిత్‌కు గాయం..

భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్‌ జైట్లీ స్టేడియంలో.. ఫస్ట్ టీ20 మ్యాచ్‌ జరగనుంది.  గత కొంత కాలంగా రెస్ట్ లేని క్రికెట్ ఆడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టీ20ల సిరీస్‌ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. తాజాగా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. నొప్పితో వెంటనే డ్రస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు.  విక్రమ్ రాథోడ్, సెనెవిరత్నే ఆపడానికి ప్రయత్నం చేసినా రోహిత్ మైదానంలో ఉండలేదు. దీంతో బీసీసీఐకు టెన్షన్ మొదలైంది.

గాయమైన  తర్వాత రోహిత్ తిరిగి ప్రాక్టీస్‌కు రాలేదు. ‘రోహిత్‌ చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు రాగానే మీడియాకు వెల్లడిస్తాం’ అని జట్టు వర్గాలు తెలిపాయి. కాకపోతే అతడు మ్యాచ్ ఆడతాడా అనే విషయంపై మాత్రం నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కాగా తొలి టీ20లో కీపింగ్‌ రిషభ్‌పంతే చేస్తాడన్న టాక్ నడుస్తోంది. సంజు శాంసన్‌ ఆటగాళ్లతో కలిసి ఫీల్డింగ్‌ చేయగా.. పంత్‌ గ్లోవ్స్‌ ధరించి ఎక్కువ సేపు సాధన చేశాడు.

Related Tags