ఆసీస్‌తో చివరి వన్డే.. జట్టుకు రోహిత్, ధావన్‌‌లు దూరం.?

శుక్రవారం ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు గాయాలపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్ తగిలి ధావన్‌కు గాయం కాగా.. ఫీల్డింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఇక వీరిద్దరూ కూడా చివరి వన్డేకు అందుబాటులో ఉండరన్న అనుమానం ఫ్యాన్స్‌లో మొదలైంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుంటున్నారని.. ఫిజియోలు ఎప్పటికప్పుడు […]

ఆసీస్‌తో చివరి వన్డే.. జట్టుకు రోహిత్, ధావన్‌‌లు దూరం.?
Follow us

|

Updated on: Jan 19, 2020 | 12:53 PM

శుక్రవారం ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు గాయాలపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్ తగిలి ధావన్‌కు గాయం కాగా.. ఫీల్డింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఇక వీరిద్దరూ కూడా చివరి వన్డేకు అందుబాటులో ఉండరన్న అనుమానం ఫ్యాన్స్‌లో మొదలైంది.

ఈ క్రమంలోనే బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుంటున్నారని.. ఫిజియోలు ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. అయితే ఇద్దరూ చివరి వన్డే ఆడతారా లేదా అన్న దానిపై తుది నిర్ణయం మాత్రం మ్యాచ్‌ మొదలయ్యే ముందే తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరు ఈ మ్యాచ్‌కు దూరమైనా.. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఎఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇకపోతే భారత్ ఈ ఆఖరి మ్యాచ్‌‌లోనూ విజయం సాధించిన సిరీస్ కైవసం చేసుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతుంటే.. గట్టి పోటీ ఇచ్చేందుకు ఆస్ట్రేలియా సన్నద్ధమవుతోంది. కాగా, సెకండ్ వన్డేలో ఆసీస్‌పై 36 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం విదితమే.