సేన-బీజేపీ ‘ చెలిమి’కి జెఎన్‌యు ‘తూట్లు’.!

హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ ఢిల్లీలో ప్రదర్శన చేస్తున్న జెఎన్‌యు విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని శివసేన ఖండించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో చేతులు కలిపిన సేన– జె ఎన్ యు విద్యార్థుల ఆందోళనను సమర్థించింది. (ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సేన-ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నానా పాట్లూ పడుతున్నాయి). కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పక్షంలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని ఖండించి ఉండేదని సేన తన ‘ సామ్నా ‘ పత్రికలో […]

సేన-బీజేపీ ' చెలిమి'కి జెఎన్‌యు 'తూట్లు'.!
Follow us

|

Updated on: Nov 21, 2019 | 8:54 PM

హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ ఢిల్లీలో ప్రదర్శన చేస్తున్న జెఎన్‌యు విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని శివసేన ఖండించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో చేతులు కలిపిన సేన– జె ఎన్ యు విద్యార్థుల ఆందోళనను సమర్థించింది. (ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సేన-ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నానా పాట్లూ పడుతున్నాయి). కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పక్షంలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని ఖండించి ఉండేదని సేన తన ‘ సామ్నా ‘ పత్రికలో పేర్కొంది. ఖాకీల తీరు అమానుషం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉండిన పక్షంలో పార్లమెంటులో బీజేపీ రభస చేసి ఉండేదా ? ఏబీవీపీ వంటి సంఘాలు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చి ఉండేవా అని సేన ప్రశ్నించింది. అంధ విద్యార్థులపై కూడా పోలీసులు లాఠీలు ఝళిపించారని, వారు చట్ట పరిరక్షకులెలా అవుతారని కూడా వ్యాఖ్యానించింది. ఏ ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల ఇంత పాశవికంగా ప్రవర్తించదని శివసేన దుయ్యబట్టింది. అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా సంబంధిత మంత్రి విద్యార్థులతో సంప్రదింపులు జరపలేరా అని కూడా సేన నాయకులు ప్రశ్నించారు. బ్యారికేడ్లను ఛేదించుకుని ముందుకు రాబోయిన స్టూడెంట్స్ పై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జి చేయడాన్ని ఇతర విపక్షాలు కూడా ఖండించాయి. కాగా-విద్యార్థులపై పోలీసులు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వారు మారణాయుధాలతో దాడికి ప్రయత్నించారని ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేశారు.