క్యూ4లో అంచనాలను మించిన ఇన్ఫోసిస్

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిన్ తాజాగా 2018-19 ఆర్థిక సంవత్సరపు క్యూ4 ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నికర లాభం 10.5 శాతం పెరుగుదలతో రూ.4,078 కోట్లకు చేరింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో క్యూ4 లాభం రూ.3,690 కోట్లుగా ఉంది. కీలకమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో పెద్ద డీల్స్ గెలుచుకోవడం ఇందుకు ప్రధాన కారణం. మార్కెట్ వర్గాలు ఇన్ఫోసిస్ నికర లాభం రూ.3,956 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశాయి. అంటే కంపెనీ ఆర్థిక ఫలితాలు […]

క్యూ4లో అంచనాలను మించిన ఇన్ఫోసిస్
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2019 | 7:10 PM

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిన్ తాజాగా 2018-19 ఆర్థిక సంవత్సరపు క్యూ4 ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నికర లాభం 10.5 శాతం పెరుగుదలతో రూ.4,078 కోట్లకు చేరింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో క్యూ4 లాభం రూ.3,690 కోట్లుగా ఉంది. కీలకమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో పెద్ద డీల్స్ గెలుచుకోవడం ఇందుకు ప్రధాన కారణం.

మార్కెట్ వర్గాలు ఇన్ఫోసిస్ నికర లాభం రూ.3,956 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశాయి. అంటే కంపెనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలు మించాయి.

మరోవైపు కంపెనీ ఆదాయం ఈ క్యూ4లో 19.1 శాతం పెరిగి… రూ.21,539 కోట్లుగా నమోదైంది. 2017-18 ఆర్థిక సంవత్సరపు క్యూ4లో కంపెనీ ఆదాయం రూ.18,083 కోట్లుగా ఉంది. కంపెనీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ షేరుకు రూ.10.5 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.