భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలి.. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు..

రాబోయే ముప్పై ఏళ్లలో దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా రూపొందించగల సామర్థ్యం వ్యాపార,

భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలి.. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 5:37 AM

రాబోయే ముప్పై ఏళ్లలో దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా రూపొందించగల సామర్థ్యం వ్యాపార, అంకుర సంస్థలకు ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మాత్యులు పీయూష్ గోయల్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2025వ సంవత్సరంలోగా ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు భాగస్వాములు కావాలని అన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆప్ కామర్స్ వర్చువల్ సదస్సులో ఆయన దేశ ప్రగతిని గురించి ప్రసంగించారు.

భారత్‌ను అత్యంత విశ్వసనీయ దేశంగా నేడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని కొనియాడారు. ఆత్మ నిర్భర్‌ను అమలు చేస్తున్నప్పటికీ ప్రపంచంతో కనెక్టవిటీ ఇంకా పెంచుకోవాలని సూచించారు. ఈ రోజు మనం అవకాశాన్ని అందుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని అన్నారు. ఇది కచ్చితంగా మన బాధ్యతగా భావించాలని గుర్తుచేశారు. ఔషధ రంగంలో ప్రగతి సాధించిన విధంగానే భారత్‌ను ప్రపంచ కర్మాగారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఆధునిక యంత్రాలను దిగుమతి చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు. తక్కువ ధరలో నాణ్యత ప్రమాణాలు పాటించి మెరుగైన వస్తువులను తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు కలిసిపోయి ట్రిలియన్ డాలర్ల భారతదేశంగా మార్చాలని వివరించారు. ఆత్మ నిర్భర్ భారత్‌ను మన మంత్రం, స్పూర్తి, లక్ష్యంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన