Breaking News
  • చెన్నై: ఇండియన్‌-2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం. షూటింగ్‌ జరుగుతుండగా ఒక్కసారిగా పడిపోయిన భారీ క్రేన్‌. అక్కడికక్కడే ముగ్గురు మృతి. మరో 10 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. పూనమల్లి దగ్గర జరుగుతున్న సినిమా షూటింగ్‌. ఇండియన్‌-2 సినిమాకు శంకర్‌ దర్శకత్వం. ఇండియన్‌-2 సినిమాలో హీరోగా నటిస్తున్న కమల్‌హాసన్‌. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు. ప్రమాద వివరాలను పోలీసులకు తెలిపిన కమల్‌హాసన్‌.
  • షూటింగ్‌ ప్రమాదంపై నటుడు కమల్‌హాసన్‌ ట్వీట్‌. షూటింగ్‌లో జరిగిన ప్రమాదం అత్యంత భయంకరమైనది. నేను ముగ్గురు స్నేహితులను కోల్పోయాను. నా బాధ కన్నా చనిపోయిన వారి కుటుంబసభ్యుల దుఃఖం చాలా ఎక్కువ. నేను వారిలో ఒకరిగా వారి కష్టాల్లో పాల్గొంటాను. మృతులకు నా ప్రగాఢ సానుభూతి-ట్విట్టర్‌లో కమల్‌హాసన్‌.
  • ఇండియన్‌-2 సినిమా షూటింగ్‌ ప్రమాదంపై లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రకటన. షూటింగ్‌ స్పాట్‌లో దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రమాదంలో ఎంతో ముఖ్యమైన ఉద్యోగులు మృతిచెందారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణ, ఆర్ట్‌ అసిస్టెంట్‌ చంద్రన్‌.. ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ మధు మృతిచెందారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి-లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ.
  • మహారాష్ట్ర: చంద్రాపూర్‌ జిల్లా ముల్‌లో ఘోర ప్రమాదం. లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి. మరో ఆరుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • కర్నూలు: నేటి నుంచి యాగంటిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఐదు రోజులపాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు.
  • తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు. ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన కంటైనర్‌, 10 మంది మృతి. మరో 26 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. తిరుపూర్‌ జిల్లా అవినాశిలో ఘటన. సేలం జిల్లా ఓమలూరులో కారు-బస్సు ఢీ. ఐదుగురు నేపాల్‌ వాసులు మృతి.

మహిళా వ్యాపారవేత్త ఆత్మహత్య.. ఆర్థిక మాంద్యమే కారణమా..?

Women Entrepreneur Commits Suicide Tamilnadu, మహిళా వ్యాపారవేత్త ఆత్మహత్య.. ఆర్థిక మాంద్యమే కారణమా..?

చెన్నైలో లాన్సన్ టొయోటా డీలర్‌షిప్ కంపెనీకి చెందిన మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు వచ్చాయని.. అందుకే తాను సూసైడ్ చేసుకుందని అనుమానిస్తున్నారు. స్థానిక నుంగంబాక్కం కోథారీ రోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివశిస్తున్నారు. లంక లింగ్ తమిళనాడులో టోయోటా కార్లకు డీలర్‌గా వ్యవహరిస్తున్న లాన్సన్ సంస్థ ఛైర్మన్‌గా, రీటా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా కంపెనీ శాఖలను విస్తరింపచేస్తున్నారు. రోజు ఉదయాన్నే 8 గంటల వరకూ రెడీ అయి ఆఫీసుకు వెళ్లే.. ఆమె 11 గంటలైనా గదిలోనుంచి అలికిడి రాకపోవడంతో పనిమనిషి నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. గదిలో ఫ్యాన్‌కి ఊరేసుకుని వేలాడుతున్నట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే రెండు, మూడు రోజులుగా ఆమె మనోవేదన చెందుతున్నట్లు విచారణలో తేలింది. భర్తతో ఏమైనా గొడవలు ఉన్నాయా..? లేక వ్యాపారంలో నష్టాలు రావడంతోనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Related Tags