బిర్లా గ్రూప్ సంస్థల ఛైర్మన్ బసంత్ కుమార్ బిర్లా కన్నుమూత

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీకే బిర్లా గ్రూప్ సంస్థల మూల పురుషుడు బసంత్ కుమార్ బిర్లా(98) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతూ ముంబయిలో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. 1921లో ఘనశ్యామ్ బిర్లా దంపతులకు జన్మించిన బీకే బిర్లా.. 15ఏళ్ల వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కేసోరామ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆ క్రమంలో కాటన్, పాలిస్టర్, నైలాన్, కాగితం, షిప్పింగ్ సహా సిమెంట్ టీ, కాఫీ ఉత్పత్తుల వంటి రంగాలలో రాణించారు. భారత పారిశ్రామిక […]

బిర్లా గ్రూప్ సంస్థల ఛైర్మన్ బసంత్ కుమార్ బిర్లా కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2019 | 6:38 AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీకే బిర్లా గ్రూప్ సంస్థల మూల పురుషుడు బసంత్ కుమార్ బిర్లా(98) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతూ ముంబయిలో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు.

1921లో ఘనశ్యామ్ బిర్లా దంపతులకు జన్మించిన బీకే బిర్లా.. 15ఏళ్ల వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కేసోరామ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆ క్రమంలో కాటన్, పాలిస్టర్, నైలాన్, కాగితం, షిప్పింగ్ సహా సిమెంట్ టీ, కాఫీ ఉత్పత్తుల వంటి రంగాలలో రాణించారు. భారత పారిశ్రామిక రంగానికి ఆధ్యుడిగా పేర్కొనే బీకే బిర్లా.. ఆ రంగంలో ఎన్నో విశేషమైన సేవలందించారు. పారిశ్రామికవేత్తగానే కాకుండా.. బీకే బిర్లా పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు.