Breaking News
  • అమరావతి: ప్రధానిమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ లో ముందు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. కరోన నివారణకు కేంద్రం ఇస్తున్న అన్ని మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మోదీ నాయకత్వంలో కరోనను పటిష్టంగా ఎదుర్కొన్నాం.
  • అనంతపురం జిల్లా: గుత్తి GRP పోలీస్ స్టేషన్ లో ప్రింటర్,స్కానర్,ఖైదీలకు వేసే సంకెళ్లు దొంగిలించిన మంజునాథ్ అనే కానిస్టేబుల్. స్టేషన్ నుంచి ఎత్తుకెళ్లిన సంకెళ్లను భార్యకు వేసి ఇంట్లో చిత్రహింసలు. భార్య ఫిర్యాదుతో కేసునమోదు చేసిన ఆదోని పోలీసులు..పోలీస్ స్టేషన్ నుండి పరార్ ఐన మంజునాథ్. మంజునాథ్ ఇంట్లో తనిఖీ చేయగా బయటపడ్డ 12 శాఖలకు చెందిన నకిలీ సీల్ లు. గుత్తి పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్,ప్రాపర్టీ,సంకెళ్లు దొంగతనం చేసినందుకు గాను 379,409,406 సెక్షన్ లకింద కేసు నమోదు చేసిన grp అధికారులు.
  • టీవీ9 తో సిటీ ED వెంకటేశ్వర రావు. సిటీ బస్సుల కు సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదు. తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతామని వార్తలు వొస్తున్నాయి అందులో వాస్తవమ్ లేదు. సిటీ చివరలో 290 సర్వీసులను ఈరోజు నుండి నడుపుతున్నాం. సిటీ కి సంబంధించి చర్చ మాత్రమే జరుగుతుంది ఎలాంటి నిర్ణయం రాలేదు. మేము మాత్రం అన్ని డిపోలలో బస్సుల ను సిద్ధం చేసి ఉంచాం. కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాట్లు కూడా చేసాం. ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నాం.
  • చెన్నై : ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కి బానిసైన పోలీస్, లక్షలలో డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్య . ధర్మపురి జిల్లాకి చెందిన వెంకటేసన్ , సేలం జిల్లాలోని ప్రత్యేక పోలీస్ బెట్టాలియన్ లో విధులు నిర్వహిస్తున్న వెంకటేసన్. గత కొంత కాలంగా గంటల తరబడి ఆన్లైన్ రమ్మీ ఆడుతూ లక్షలలో డబ్బులు పోగొట్టుకోవడం తో తీవ్ర మనస్థాపం . గవర్నమెంట్ హాస్టల్ తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య , కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.
  • హాస్పటల్ లో చేరిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. మనీశ్ సిసోడియా కు ఈనెల 14 న కరోనా పాజిటివ్ గా నిర్దారణ . ఈ నెల 14 నుండి హోం క్వారంటైన్ లో ఉంటున్న మనీశ్ సిసోడియా.
  • ఇప్పటివరకు దేశంలో “కరోనా” వల్ల ముగ్గురు ఎమ్.పి లు, ఒక కేంద్ర మంత్రి మృతి. 1) బల్లి దుర్గా ప్రసాద్ ( AP) 2) హెచ్. వసంత్ కుమార్ ( TN) 3) అశోక్ గస్తీ ( Ktk) ——— 4) సురేష్ అంగాడీ ( KTK) ( కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి.

ఐఎన్‌ఎక్స్ కేసులో అప్రూవర్‌గా ఇంద్రాణి

INX Indrani, ఐఎన్‌ఎక్స్ కేసులో అప్రూవర్‌గా ఇంద్రాణి

ఇంద్రాణి ముఖర్జీయా అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొటున్నారు. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారతానంటూ కోర్టుకు విఙ్ఞప్తి చేయడంతో ప్రత్యేక న్యాయస్ధానం అంగీకరించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కుంభకోణం వెనుకు ఉన్న రహస్యాలన్నీ ఇంద్రాణికి తెలుసని సీఐబీ.. ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ఈ నేపధ్యంలోనే ఆమె అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 11న జరగనుంది.

ఐఎన్ఎక్స్ మీడియాను 2007లో పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా కలిసి ప్రారంభించారు. అయితే ఈ సంస్ధకు నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ నిధులు రావడం వెనుక అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం హస్తం ఉన్నట్టుగా సీబీఐ అనుమానిస్తోంది. అదే విధంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ( ఎఫ్ఐపీబీ) ఆమెదించడంలో ఆయన తనయుడు కార్తీ చిదంబరం పాత్ర కూడా ఉన్నట్టుగా సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో పదేళ్ల తర్వాత కార్తీ చిదంబరంపై కేసు నమోదైంది. ప్రస్తుతం పీటర్ ముఖర్జియా తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటూ ముంబై బైకుల్లా జైలులో ఉన్నారు.

Related Tags