మళ్ళీ 12 న భారత్-చైనా మధ్య కోర్ కమాండర్ల చర్చలు

భారత-చైనాల మధ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లడాఖ్ లో తాజా పరిస్థితిపై ఈ నెల 12 న కోర్ కమాండర్ల స్థాయిలో చర్చలు జరగనున్నాయి. చైనా వైపు నుంచి డీ-ఎస్కలేషన్..

మళ్ళీ 12 న భారత్-చైనా మధ్య కోర్ కమాండర్ల చర్చలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 04, 2020 | 3:03 PM

భారత-చైనాల మధ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లడాఖ్ లో తాజా పరిస్థితిపై ఈ నెల 12 న కోర్ కమాండర్ల స్థాయిలో చర్చలు జరగనున్నాయి. చైనా వైపు నుంచి డీ-ఎస్కలేషన్ (పాక్షిక ఉపసంహరణ) అంశం ప్రధానంగా ఈ చర్చల్లో కీలకం కానుంది. గత నెల 21 న ఇండో-చైనా సీనియర్ కమాండర్ల ఆరో దఫా చర్చలు జరిగాయి. ఉభయ దేశాల నేతల మధ్య కుదిరిన అత్యంత ప్రధానమైన ఏకాభిప్రాయాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని ఆ సందర్భంగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద మరిన్ని దళాలను మోహరించకుండా లేదా పంపకుండా నివారించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంప్రదింపుల ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఏర్పాటైన వర్కింగ్ మెకానిజం పానెల్ చర్చల్లో.. నియంత్రణ రేఖ వద్ద ఉభయ కమాండర్ల మధ్య కమ్యూనికేషన్ ను బలోపేతం చేయాలన్న సూచనపై ఏకాభిప్రాయం కుదిరింది. అంటే తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు రెండు దేశాల సైనికాధికారులు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని తీర్మానించారు. అపోహలు తొలగేలా, ఆ ప్రాంతం వద్ద సుస్థిరత నెలకొనేలా చూడాలని కూడా ఆకాంక్షించారు.