కోవిడ్-19 ఎఫెక్ట్… ఇండిగో, విస్తారా విమానాలు ఇక ఎగరవా ?

కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ వంటి ఆంక్షలు విధించడం వల్లో,  ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడం వల్లో ఇండియాలో రెండు ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఇండిగో, విస్తారా విమానాలను

కోవిడ్-19 ఎఫెక్ట్... ఇండిగో, విస్తారా విమానాలు ఇక ఎగరవా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 19, 2020 | 12:28 PM

కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ వంటి ఆంక్షలు విధించడం వల్లో,  ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడం వల్లో ఇండియాలో రెండు ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఇండిగో, విస్తారా విమానాలను గ్రౌండ్ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ విమానాలు ఇక విమానాశ్రయాల్లోనే ఉండిపోతాయి. ఆసియాలోనే అతి పెద్ద బడ్జెట్ ఎయిర్ లైన్.. ఇండిగో.. సర్వీసులు ఇండియాలో నత్తనడకన సాగుతున్నాయి. ప్రయాణికుల ట్రాఫిక్ 30 శాతం తగ్గిపోయినట్టు సమాచారం. విస్తారా పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. కరోనా నేపథ్యంలో.. సింగపూర్ నుంచి తమ ఫస్ట్ బ్యాచ్ బోయింగ్ విమానాల డెలివరీని ఈ ఎయిర్ లైన్స్ సంస్థ వాయిదా వేసుకొవచ్చు. రానున్న రోజుల్లో డిమాండ్ 40 శాతం నుంచి 50 శాతం తగ్గిన పక్షంలో.. ఇండియన్ ఎయిర్ లైన్స్ మొదటి దశలో 150 విమానాలను గ్రౌండ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ ఏవియేషన్ అంచనా వేసింది. అయితే ఇండిగో..విస్తారా యాజమాన్యాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘ఊహాగానాలపై’ తాము మాట్లాడబోమని ఈ రెండు సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు.

కోవిడ్-19 కారణంగా ఇప్పటికే అంతర్జాతీయంగా అనేక విమానాలు రద్దయ్యాయి. నిజానికి తమ విమానాలను తగ్గించరాదని ఇండియన్ ఎయిర్ లైన్స్ భావిస్తున్నప్పటికీ.. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా దీనిపై యోచించవచ్చునని అంటున్నారు.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.