ఆహారం లేకుండా… రాత్రంతా విమానంలోనే…!

ఇండిగో సంస్థ తన ప్రయాణికులను రాత్రంతా నిలిచిఉన్న విమానంలోనే ఉంచిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై నుంచీ జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం… బుధవారం రాత్రంతా ముంబై ఎయిర్‌పోర్టులో ఉంది. అందులో ప్రయాణికుల్ని అలాగే ఉంచింది. ఎన్ని గంటలైనా ప్రయాణికుల్ని మాత్రం కిందకు దిగవద్దని ఫ్లైట్ ఇంజినీర్లు ఆదేశించారు. దీనిపై స్పందించిన పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. ముంబయి విమానాశ్రయం నుంచి రాత్రి 7.55 గంటలకు జైపూర్‌కు బయల్దేరాల్సిన ఇండిగో విమానం మరుసటి రోజు […]

ఆహారం లేకుండా... రాత్రంతా విమానంలోనే...!
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 7:19 PM

ఇండిగో సంస్థ తన ప్రయాణికులను రాత్రంతా నిలిచిఉన్న విమానంలోనే ఉంచిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై నుంచీ జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం… బుధవారం రాత్రంతా ముంబై ఎయిర్‌పోర్టులో ఉంది. అందులో ప్రయాణికుల్ని అలాగే ఉంచింది. ఎన్ని గంటలైనా ప్రయాణికుల్ని మాత్రం కిందకు దిగవద్దని ఫ్లైట్ ఇంజినీర్లు ఆదేశించారు. దీనిపై స్పందించిన పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. ముంబయి విమానాశ్రయం నుంచి రాత్రి 7.55 గంటలకు జైపూర్‌కు బయల్దేరాల్సిన ఇండిగో విమానం మరుసటి రోజు ఉదయం 6 గంటలకు టేకాఫ్‌ అయిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ముంబయిలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా దాదాపు 20 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో ఎక్కువగా ఇండిగో విమానాలే ఉండడం గమనార్హం. ”ప్రయాణికులంతా గత రాత్రి విమానంలోకి ప్రవేశించారు. కానీ విమానం ఉదయం ఆరు గంటలకు బయల్దేరింది. రాత్రంతా మేం విమానంలోనే ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కనీసం ఆహారం కూడా పెట్టలేదు. ఈ ఘటనపై అందరూ కోపంతో ఉన్నారు.” అని ప్రయాణికులు ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు.

ప్రయాణికుల ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటనపై తక్షణం విచారణ చేపడతామని డీజీసీఏ ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. రాత్రంతా ప్రయాణికులను విమానంలోనే ఎందుకు ఉంచాల్సి వచ్చిందో, వర్షాల వల్ల ఎన్ని విమానాలను రద్దు చేశారో ఇండిగో సంస్థను ఇప్పటికే వివరణ కోరామని గురువారం ఆయన తెలిపారు.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..