ఇండిగో ఫ్లైట్ లేట్… హైదరాబాదీల ఇక్కట్లు..!

లక్‌నవూ నుంచి హైదరాబాద్ చేరాల్సిన ఇండిగో విమానం దాదాపు 8 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో సుమారు 112 మంది ప్రయాణికులు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జ్‌లో రాత్రంతా వేచి ఉన్నారు. లక్‌నవూ విమానాశ్రయ అథారిటీ ప్రతినిధి సంజయ్ నరేన్ మాట్లాడుతూ, “ఇండిగో విమాన 6E 278 గురువారం రాత్రి 9:15 గంటలకు బయలుదేరి అదే రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది, అయితే ఎనిమిది గంటలకు పైగా ఆలస్యంగా శుక్రవారం […]

ఇండిగో ఫ్లైట్ లేట్... హైదరాబాదీల ఇక్కట్లు..!
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2019 | 12:57 AM

లక్‌నవూ నుంచి హైదరాబాద్ చేరాల్సిన ఇండిగో విమానం దాదాపు 8 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో సుమారు 112 మంది ప్రయాణికులు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జ్‌లో రాత్రంతా వేచి ఉన్నారు. లక్‌నవూ విమానాశ్రయ అథారిటీ ప్రతినిధి సంజయ్ నరేన్ మాట్లాడుతూ, “ఇండిగో విమాన 6E 278 గురువారం రాత్రి 9:15 గంటలకు బయలుదేరి అదే రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది, అయితే ఎనిమిది గంటలకు పైగా ఆలస్యంగా శుక్రవారం ఉదయం 8:19 గంటలకు ల్యాండ్ అయింది.” అని తెలిపారు. ఫలితంగా ప్రయాణీకులు రాత్రంతా ఏరోబ్రిడ్జిలోనే వేచి ఉన్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు సమాచారం.