చెన్నై ఎయిర్ పోర్టులో బాంబు కలకలం

చెన్నై: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. అప్పుడే చెన్నై ఏయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు బాంబులు ఉన్నాయా ఏమైనా.. అంటూ అరవడంతో ఒక్కసారిగా చెన్నై విమానాశ్రయం ఉలిక్కిపడింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ అతడి ప్రయాణాన్ని రద్దు చేసింది. కేరళలోని పతానంతిట్టకు చెందిన అలెక్స్ మథ్యూ అనే వ్యక్తి మంగళవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాడు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో భద్రత సిబ్బంది అందరినీ తనిఖీ చేస్తున్నారు. అయితే విమానం సిబ్బంది కాకుండ సీఐఎస్ఎఫ్, ఎస్ఎల్‌పీసీ దశల వారీగా […]

చెన్నై ఎయిర్ పోర్టులో బాంబు కలకలం
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2019 | 8:02 PM

చెన్నై: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. అప్పుడే చెన్నై ఏయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు బాంబులు ఉన్నాయా ఏమైనా.. అంటూ అరవడంతో ఒక్కసారిగా చెన్నై విమానాశ్రయం ఉలిక్కిపడింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ అతడి ప్రయాణాన్ని రద్దు చేసింది. కేరళలోని పతానంతిట్టకు చెందిన అలెక్స్ మథ్యూ అనే వ్యక్తి మంగళవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాడు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో భద్రత సిబ్బంది అందరినీ తనిఖీ చేస్తున్నారు. అయితే విమానం సిబ్బంది కాకుండ సీఐఎస్ఎఫ్, ఎస్ఎల్‌పీసీ దశల వారీగా తనిఖీ చేస్తున్నారు. అనంతరం బోర్డింగ్ పాయింట్ వద్ద మరోసారి తనిఖీ చేపట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అలెక్స్ నా బ్యాగులో ఏమైనా బాంబును మోసుకెళ్తున్నానా? అని గట్టిగా అరిచాడు. వెంటనే డాగ్ స్క్వార్డ్, బాంబ్ డిటెక్షన్, డిస్పోసల్ స్క్వార్డ్ బృందాలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. అయితే ప్రయాణికుడు అసహనంతో అలా అన్నాడని తెలుసుకున్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుడు అలా అరవడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికుడి ప్రయాణాన్ని కూడా రద్దుచేసింది.