భారత యువతా ! ఎకానమీకి ఊతం ఇక మీ చేతుల్లోనే !

దేశంలో లాక్ డౌన్ ఆంక్షలను వివిధ రంగంలో సడలిస్తున్న నేపథ్యంలో.. ఇక యువతే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలరని ప్రభుత్వం భావిస్తోంది. కరోనాను ఎదుర్కొనే యోధులు వీరేనని అంటోంది. జనాభాలో 85 శాతం యువజనులేనని, రోగ నిరోధక శక్తి వీరికి ఎక్కువగా ఉంటుందని...

భారత యువతా ! ఎకానమీకి ఊతం ఇక మీ చేతుల్లోనే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 17, 2020 | 5:41 PM

దేశంలో లాక్ డౌన్ ఆంక్షలను వివిధ రంగంలో సడలిస్తున్న నేపథ్యంలో.. ఇక యువతే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలరని ప్రభుత్వం భావిస్తోంది. కరోనాను ఎదుర్కొనే యోధులు వీరేనని అంటోంది. జనాభాలో 85 శాతం యువజనులేనని, రోగ నిరోధక శక్తి వీరికి ఎక్కువగా ఉంటుందని, అందువల్ల.. మెల్లగా కీలక రంగాల్లో సడలింపులు కల్పిస్తున్న దృష్ట్యా..దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవానికి వీరి కృషి ఆలంబన కాగలదని నిపుణులు అంటున్నారు. ప్రాంతీయంగా లాక్ డౌన్ ని దశలవారీగా ఎత్తివేసిన పక్షంలో దేశంలో కరోనా కేసులు లేని చోట్ల మునుపటికన్నా ఎక్కువగా ఆయా రంగాల్లో యువశక్తిని ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇండియాలో 529 జిల్లాల్లో 60 ఏళ్ళ కన్నా తక్కువ వయసున్నవారు 85 శాతం ఉన్నట్టు అంచనా. వీరిలో చాలామంది [ప్రభుత్వం గ్రీన్ జోన్ గా గుర్తించిన 353 జిల్లాల్లో ఉన్నారు. ఈ జిల్లాల్లో అసలు కరోనా కేసులు లేవు. ఈ కారణంగా మొదట ఇలాంటి ప్రాంతాలను గుర్తించి ఈ జిల్లాలోని యువకులను ప్రభుత్వ అభివృధ్ది కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సర్కార్ ప్రతిపాదిస్తోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయినవారిని మోడీ ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో చూడాలి..