పొరుగుదేశాల సేవలో.. భారత నావికాదళం, వైద్య బృందాలు..!

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకు సహాయపడేందుకు భారత దేశం సిద్ధంగా ఉంది. అవసరమైతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 6 నావికా

పొరుగుదేశాల సేవలో.. భారత నావికాదళం, వైద్య బృందాలు..!
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 8:15 PM

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకు సహాయపడేందుకు భారత దేశం సిద్ధంగా ఉంది. అవసరమైతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 6 నావికా దళ నౌకలు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచింది. మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో కరోనా వైరస్ నిరోధక చర్యల్లో పాల్గొనేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. 6 నావికా దళ నౌకలు, వైద్య బృందాలు, మానవతావాద సహాయం, విపత్తు సహాయక కిట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ నౌకలు, సామగ్రి, సిబ్బంది విశాఖపట్నం, కొచ్చి, ముంబైలలో ఉన్నాయని పేర్కొంది.

కాగా.. అత్యవసర సరఫరాలను రవాణా చేసేందుకు భారత వాయు సేనకు చెందిన 28 ఫిక్స్‌డ్ వింగ్ విమానాలు, 21 హెలికాప్టర్లు భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు దాదాపు 60 టన్నుల అత్యవసర వస్తువులు, మందులు, వైద్య పరికరాల రవాణా కోసం భారత వాయు సేన విమానాలను వినియోగించారు. భారత వాయు సేనకు చెందిన సీ-130జే సూపర్ హెర్క్యులెస్ విమానం 6.2 టన్నుల మందులను మాల్దీవులకు గురువారం తీసుకెళ్లింది. ఆ దేశంలో సొంతంగా టెస్టింగ్, ట్రీట్‌మెంట్, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు కోసం సహాయపడేందుకు భారత సైన్యానికి చెందిన వైద్య బృందాన్ని మార్చి 13-21 మధ్య పంపించారు.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.