దేశంలో చిరుతపులుల సంఖ్య.. పులుల సంఖ్యలో మధ్యప్రదేశ్ తొలిస్థానం.. రెండో స్థానంలో…

దేశంలో చిరుత పులుల సంఖ్య పెరిగింది. చిరుతపులులు సంఖ్య 60శాతం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 'స్టేటస్ ఆఫ్ లిపార్డ్ ఇన్ ఇండియా 2018' నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం విడుదల చేశారు.

దేశంలో చిరుతపులుల సంఖ్య.. పులుల సంఖ్యలో మధ్యప్రదేశ్ తొలిస్థానం.. రెండో స్థానంలో...
Follow us

|

Updated on: Dec 21, 2020 | 10:14 PM

దేశంలో చిరుత పులుల సంఖ్య పెరిగింది. చిరుతపులులు సంఖ్య 60శాతం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘స్టేటస్ ఆఫ్ లిపార్డ్ ఇన్ ఇండియా 2018’ నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం విడుదల చేశారు. ఈ  నివేదిక ప్రకారం ప్రస్తుతం 12,852 చిరుత పులులు ఉన్నాయి . 2014లో నిర్వహించిన సర్వే కంటే ప్రస్తుతం చిరుత పులుల  60 శాతానికి పైగా ఉన్నదని ప్రకాష్ జవదేకర్ తెలిపారు.  ఇక పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను ఆయన అభినందించారు.  మధ్యప్రదేశ్ 3,421 చిరుత పులులతో తొలిస్థానంలో ఉండగా, 1,783 సంఖ్యతో కర్ణాటక రెండో స్థానంలో 1,690 సంఖ్యతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.