Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

భారత్‍లో 63 కోట్లకు చేరువలో ఇంటర్నెట్ యూజర్స్

, భారత్‍లో 63 కోట్లకు చేరువలో ఇంటర్నెట్ యూజర్స్

టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్‌ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో 63 కోట్లకు పెరగగలదని కాంటర్‌ ఐఎమ్‌ఆర్‌బీ సంస్థ అంచనా… గ్రామాల్లో ఇంటర్నెట్‌ వృద్ధి జోరుగా ఉందని, దీంతో నెట్‌ వాడకందారుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఈ సంస్థ తన తాజా ఐక్యూబ్‌ 2018 నివేదికలో పేర్కొంది. ఇంటర్నెట్‌ కోసం దాదాపు 97 శాతం మంది మొబైల్‌ ఫోన్లనే వినియోగిస్తున్నారని, మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో మహిళల సంఖ్య 42 శాతంగా ఉంది.

►గతేడాది ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 18% వృద్ధి చెంది, తొలిసారిగా 50 కోట్లు దాటేసింది. పల్లెల్లో ఇంటర్నెట్‌ వృద్ధి, వినియోగం జోరుగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.
►ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారిలో 87% మంది రెగ్యులర్‌ వినియోగదారులే. వీరంతా కనీసం నెలకు ఒక్కసారైనా నెట్‌ వాడుతున్నారు.
​​​​​​​►మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 29 కోట్ల మంది పట్టణ వాసులు కాగా, 25 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు.
​​​​​​​►ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య–పట్టణ ప్రాంతాల్లో 7 శాతం పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం వృద్ధి చెందడం విశేషం.
​​​​​​​►2018లో గ్రామీణ ప్రాంతాల్లో 25 కోట్ల మేర ఉన్న ఇంటర్నెట్‌ వినియోగ దారుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 30 కోట్లకు చేరవచ్చు.