ఆ పార్టీలో అందరూ మహిళలే.. ఇదే దేశంలో మొదటిది.!

ఇప్పుడు ఉన్న చాలా రాజకీయ పార్టీలు.. మేము మహిళలకు అత్యంత ప్రాధ్యానం ఇస్తాం.. వారికీ పార్టీ టిక్కెట్లు కూడా ఇస్తాం అని అంటారు కానీ చివరికి మొండికేస్తారు. కనీసం 33 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికనైనా టిక్కెట్లు ఇస్తున్నాయా అంటే అదీ లేదు. అందుకే ఇలాంటి విధానాల్ని ఖండిస్తూ.. ముంబైలో నేషనల్ ఉమెన్స్ పార్టీ(NWP) ఏర్పాటైంది. లోక్ సభలో మొత్తం 545 స్థానాలు ఉండగా.. అందులో ఈ పార్టీ మహిళా అభ్యర్థులు దాదాపు 283 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు […]

ఆ పార్టీలో అందరూ మహిళలే.. ఇదే దేశంలో మొదటిది.!
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 26, 2019 | 8:05 PM

ఇప్పుడు ఉన్న చాలా రాజకీయ పార్టీలు.. మేము మహిళలకు అత్యంత ప్రాధ్యానం ఇస్తాం.. వారికీ పార్టీ టిక్కెట్లు కూడా ఇస్తాం అని అంటారు కానీ చివరికి మొండికేస్తారు. కనీసం 33 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికనైనా టిక్కెట్లు ఇస్తున్నాయా అంటే అదీ లేదు. అందుకే ఇలాంటి విధానాల్ని ఖండిస్తూ.. ముంబైలో నేషనల్ ఉమెన్స్ పార్టీ(NWP) ఏర్పాటైంది. లోక్ సభలో మొత్తం 545 స్థానాలు ఉండగా.. అందులో ఈ పార్టీ మహిళా అభ్యర్థులు దాదాపు 283 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ పార్టీ మహిళలది మాత్రమే కాదండి.. తల్లులది కూడా. ఇక దీన్ని ప్రారంభించింది ఓ మెడికో, సామాజిక వేత్త డాక్టర్ శ్వేతా శెట్టి. లోక్ సభలో మహిళలకు 50 శాతం ఉండాలన్నది ఆమె డిమాండ్.

ఆమె మాట్లాడుతూ ‘ మహిళల ప్రాతినిధ్యంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నా.. ఏమి ఉపయోగం ఉండటం లేదు. పార్లమెంట్ లో ఎక్కువ మంది మగవాళ్ళు కావడం వల్లే.. మహిళలకు గుర్తింపు రావట్లేదని ఆమె తెలిపారు. అందుకే మహిళా సాధికారతే తమ పార్టీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మహిళల శక్తి సామర్ధ్యాన్ని బయటికు తేవడమే తమ పార్టీ లక్ష్యాల్లో ఒకటని.. వారు సాధికారత సాధించేందుకు తగిన సాయం చేస్తామన్నారు.

కాగా త్వరలో ఈ పార్టీ మహిళా రక్షక్ అనే మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించబోతున్నారట. ఎమర్జెన్సీ సమయాల్లో మహిళల్ని కాపాడేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆమె చెబుతున్నారు.