కరోనా విశ్వరూపం.. ఇరాన్ లో 275 మంది భారతీయులకు ఇన్ఫెక్షన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ….

ఇరాన్ లో చిక్కుబడిన 275 మంది భారతీయులకు కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని ప్రభుత్వం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 12 మందికి, ఇటలీలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వఛ్చినట్టు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ బుధవారం లోక్ సభలో తెలిపారు.  హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంక దేశాల్లో ఒక్కొక్కరికి ఈ వ్యాధి వఛ్చినట్టు తెలిసిందన్నారు. ఇరాన్ నుంచి నాలుగో విడత బ్యాచ్ లో 53 మంది భారతీయులు ఇటీవలే స్వదేశానికి చేరుకున్నారని […]

కరోనా విశ్వరూపం.. ఇరాన్ లో 275 మంది భారతీయులకు ఇన్ఫెక్షన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ....
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 18, 2020 | 4:06 PM

ఇరాన్ లో చిక్కుబడిన 275 మంది భారతీయులకు కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని ప్రభుత్వం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 12 మందికి, ఇటలీలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వఛ్చినట్టు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ బుధవారం లోక్ సభలో తెలిపారు.  హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంక దేశాల్లో ఒక్కొక్కరికి ఈ వ్యాధి వఛ్చినట్టు తెలిసిందన్నారు. ఇరాన్ నుంచి నాలుగో విడత బ్యాచ్ లో 53 మంది భారతీయులు ఇటీవలే స్వదేశానికి చేరుకున్నారని ఆయన ఓ లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. అయితే ఇరాన్ లో ఇంకా మిగిలి ఉన్న భారతీయులను తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానాన్ని  దాటవేశారు. అటు-పంజాబ్ లోని లూధియానాలో సుమారు 167 మంది కరోనా అనుమానిత రోగులు పరారైనట్టు వఛ్చిన వార్తల పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వీరిని గుర్తించి తిరిగి వారి వారి ఐసొలేషన్ లోకి పంపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మురళీధరన్ పేర్కొన్నారు. ఒక్కసారిగా ఇంతమంది పరార్ కావడాన్ని  పంజాబ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నామన్నారు.