Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

ఎకానమీ తెచ్చిన ‘ తంటా ‘.. అండర్ వేర్ల అమ్మకాలు డీలా !

Thats how bad the economy is, ఎకానమీ తెచ్చిన ‘ తంటా ‘.. అండర్ వేర్ల అమ్మకాలు డీలా !

పండుగల సీజన్ వస్తే చాలు.. వామ్మో ! ఫ్యాషన్ ఇండస్ట్రీ కళకళలాడిపోతుంది. లేటెస్ట్ డ్రెస్సులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అందులోనూ మగవారి కుర్తాలు, పైజామాలే కాదు.. సూట్స్ , జీన్స్, ప్యాంట్స్ , షర్ట్స్ , టీ-షర్ట్స్ ..ఒకటేమిటి ? ఇలా అన్ని రకాల బ్రాండ్లూ షాపింగ్ మాల్స్ లో దర్శనమిస్తాయి. సినీ హీరోల్లా కనబడాలంటే యువత వీటిమీదికి ఎగబడక తప్పదు. అయితే కాయిన్ కి మరోవైపులా.. అండర్ వేర్లకు మాత్రం గడ్డు రోజులు దాపురించాయి. వీటి అమ్మకాలు ఉసూరుమనిస్పిస్తున్నాయి. యువకులు, మహిళలు, పిల్లలనే కాదు.. ప్రతివారూ ధరించే వీటి కొనుగోళ్లు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. ‘ లక్స్ కోజీ ‘, ‘ డాలర్ ఇండస్ట్రీస్ ‘, ‘ రూపా ‘ వంటి బ్రాండ్ల ఇన్నర్ వేర్ల సేల్స్ ఈ సారి పుంజుకోలేదట.. వీటిని అమ్మే చిన్నపాటి రిటైల్ షాపులు కేంద్రం తెచ్చిన డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి ‘ డబుల్ దెబ్బల ‘ నుంచి కోలుకోకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంకా వీటిని ‘ పీడిస్తుండగా ‘.. జీఎస్టీ ఎఫెక్ట్ కూడా తన ‘ ప్రతాపాన్ని ‘ చూపుతోంది. కుప్పలకొద్దీ మార్కెట్ కు వస్తున్న అండర్ వేర్ గార్మెంట్స్ ను ఇందుకు సంబంధించిన ఔట్ లెట్లు కొనుగోలు చేయడంలేదని, పైగా చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నాయని తెలుస్తోంది. దీంతో ఉత్పత్తిదారులకు కూడా మూలధన పెట్టుబడి రాక దిక్కులు చూస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి ఔట్ లెట్లు దాదాపు లక్ష వరకు ఉన్నాయని అంచనా.. ‘ ఎడెల్ వీస్ ‘ అనే రీసెర్చ్ సంస్థ ఇది.. మొత్తం అండర్ గార్మెంట్ల అమ్మకాల్లో 60 శాతం వీటిదే పైచేయి. మిగతా వాటిని షాపింగ్ మాల్స్ కొనుగోలు చేస్తున్నాయి. అలాగే ఆన్ లైన్ పోర్టల్స్ కూడా ! ‘ టెక్నో పాక్ ‘ అనే కన్సల్టెన్సీ సంస్థ 2014 లో రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం.. ఇండియాలో ఇన్నర్ వేర్స్ మార్కెట్ విలువ రూ. 19,950 కోట్లు.. ఇది 2024 నాటికి రూ. 68,270 కోట్లకు చేరాలంటే సాలుకు 13 శాతం పెంపుదల ఉండాలి.. కానీ ఆ పరిస్థితి కనబడడం లేదు.

Thats how bad the economy is, ఎకానమీ తెచ్చిన ‘ తంటా ‘.. అండర్ వేర్ల అమ్మకాలు డీలా !

గత ఆరు నెలలుగా వీటి అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయని ‘ రూపా ‘ ఇన్నర్ వేర్ల ఉత్పత్తిదారు కె.బి. అగర్వాల్ తెలిపారు. అమ్మకాలు తగ్గడంతో ఇండస్ట్రీ అల్లాడుతోందన్నారు. పార్లే జీ బిస్కెట్స్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు కస్టమర్ల సెంటుమెంట్ మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ అమ్మకాలు 10 నుంచి 15 శాతం తగ్గినట్టు ఆయన చెప్పారు. ఈ పండుగల సీజన్ తమకు డల్ గా ఉండడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘ లక్స్ ఇండస్ట్రీస్ ‘ చైర్మన్ అశోక్ కుమార్ టోడీ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము ఇబ్బందికర పరిస్థితుల్లో ‘ ప్రయాణిస్తున్నామని ‘ ఆయన అన్నారు. చిన్న తరహా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి కేంద్రం ఏదో ఒక చర్య చేపట్టాలని ఆయన కోరారు. తాము ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని డాలర్ ఇండస్ట్రీస్ ఎండీ వినోద్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏమైనా.. ‘ బయటి ప్రపంచాన్ని ‘ చూస్తున్న గార్మెంట్స్.. ‘ వెలిగిపోతుంటే ‘.. ఇన్నర్ వేర్ లు మాత్రం ‘ చీకట్లోనే మగ్గిపోతున్నాయి ‘.