140 పాములతో ఫ్రెండ్‌షిప్.. కానీ.. మెడకు చుట్టుకుని..!

పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా.. 140 పాములను పెంచుకుంటోంది లారా హర్ట్ అనే మహిళ. ఆమెకు పాములంటే చాలా ఇష్టం. దీంతో.. ఇంట్లోనే 140 పాములను పెంచుతుంది. కానీ.. చివరకు వాటివల్లనే ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే.. లారా హార్ట్ (36) అనే మహిళ ఇండియానాలోని ఆక్స్‌‌ఫర్డ్‌లో నివసిస్తుంది. చిన్నప్పటి నుంచీ ఆమెకు పాములమీద ఇష్టం ఏర్పడటంతో.. వివిధ దేశాలకు చెందిన పాము జాతులను తెచ్చి.. ఇంట్లోనే పెంచుతోంది. కానీ.. బుధవారం ఆమె అనుకోకుండా.. ఆకస్మికంగా […]

140 పాములతో ఫ్రెండ్‌షిప్.. కానీ.. మెడకు చుట్టుకుని..!
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 12:31 PM

పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా.. 140 పాములను పెంచుకుంటోంది లారా హర్ట్ అనే మహిళ. ఆమెకు పాములంటే చాలా ఇష్టం. దీంతో.. ఇంట్లోనే 140 పాములను పెంచుతుంది. కానీ.. చివరకు వాటివల్లనే ప్రాణాలు విడిచింది.

వివరాల్లోకి వెళ్తే.. లారా హార్ట్ (36) అనే మహిళ ఇండియానాలోని ఆక్స్‌‌ఫర్డ్‌లో నివసిస్తుంది. చిన్నప్పటి నుంచీ ఆమెకు పాములమీద ఇష్టం ఏర్పడటంతో.. వివిధ దేశాలకు చెందిన పాము జాతులను తెచ్చి.. ఇంట్లోనే పెంచుతోంది. కానీ.. బుధవారం ఆమె అనుకోకుండా.. ఆకస్మికంగా మృతి చెందింది. తరువాతి ఉదయం ఆమె ఇంటికి వచ్చిన పనివారు.. చూసి షాక్‌ అయి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని. దర్యాప్తు చేయగా.. అంతులేని బయటకు వచ్చాయి.

ఫారెన్సిక్ నివేదిక ప్రకారం.. ఆమె గొంతు బిగుతుగా.. ఎవరో నులిమి చంపేశారని.. రిపోర్ట్ వచ్చింది. దీంతో.. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టగా… కొండచిలువనే ఆమె మరణానికి కారణమని తేల్చారు. ఇలా తను ఎంతో ఆశగా పెంచుకున్న పాముల చేతిలో తానే.. బలైపోయింది.