తెలుగు విద్యార్ధికి ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..

Indian student gets a year in jail in US for damaging college computers, తెలుగు విద్యార్ధికి ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..

తెలుగు విద్యార్ధికి అమెరికాలో ఏడాది జైలు శిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కంప్యూటర్స్‌ను ధ్వంసం చేశాడని కాలేజ్‌ యజమాన్యం ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసులో విచారణ చేపట్టిన నార్త్‌ కరోలినా ఫెడరల్‌ కోర్ట్‌.. అతనికి ఏడాది జైలు శిక్షతో పాటు 41.5 లక్షల రూపాయాల భారీ జరిమానా విధించింది.

చిత్తూరు జిల్లాకు చెందిన 27 ఏళ్ల ఆకుతోట విశ్వనాథ్‌ 2015 నుంచి స్టుడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. ఐతే అల్బానీ సెయింట్‌ రోస్‌ కాలేజీలోని 66 కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశాడని తేలడంతో.. అతనికి శిక్ష ఖరారు చేసింది నార్త్‌ కరోలినా ఫెడరల్‌ కోర్ట్‌. ఏడాది జైలు శిక్షతో పాటు 58 వేల 471 డాలర్లు.. అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు 42 లక్షల రూపాయల భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 14న కంప్యూటర్లకు యూఎస్‌బీ కిల్లర్‌ను పెట్టడం ద్వారా.. కరెంట్ సరఫరా హెచ్చుతగ్గులకు లోనై యూఎస్‌బీ పోర్ట్‌ దెబ్బతింది. దీంతో అతనిపై కాలేజ్‌ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.. అదే నెల 22న విశ్వనాథ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారణలో అతను నేరం అంగీకరించడంతో న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *