Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 16 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 216919. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 106737. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 104106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6075. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • జిహెచ్‌ఎంసి స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుదల చేసిన కమిషనర్ లోకేష్ కుమార్ . కొత్త స్టాండింగ్ క‌మిటీ ఎంపిక‌కు రేపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ . ఈ నెల 10 నుండి 18 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ .
  • ఇంటర్ బోర్డ్ , ఎగ్జామినర్ ల మధ్య బస్ ఛార్జ్ ల లొల్లి. పేపర్ వాల్యుయేషన్ కి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్ లు ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డ్ . ఎగ్జామినర్ ల నుండి ఆ టైం లో ఛార్జ్ లు వసూలు చేయని ఆర్టీసీ. ఇంటర్ బోర్డ్ ఆర్టీసీ కి రాసిన లేఖతో టికెట్ ఛార్జ్ లు తీసుకొని ఆర్టీసీ . ఇప్పుడు ఛార్జ్ లు కట్టాలని అంటున్న ఇంటర్ బోర్డ్ .
  • పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు నివేదికలో విద్యా శాఖ. పదో తరగతి పరీక్ష కేంద్రాలను 2530 నుంచి 4535కి పెంచాం. పదో తరగతి విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లవుజులు సేకరించి కేంద్రాలకు పంపించాం. కేంద్రానికి ఒకరు చొప్పున 4,535 మంది వైద్య సిబ్బంది. డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
  • తెలుగు ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు అమెరికాలోని భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా రవి కోట నియామకం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం వాషిగ్టంట్ (డీసీ)లోని రాయబార కార్యాలయంలో విధులు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న రవి కోట.
  • తిరుమల: శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఈఓ కామెంట్స్. 8వ తేది నుండి భక్తులకు దర్శనాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రేపు మరోసారి సమావేశం నిర్వహించి దర్శన విధానాలను ప్రకటిస్తాం. భక్తుల సంఖ్య, గదుల కేటాయింపు, రవాణా, ప్రసాదాల విక్రయం, టైంస్లాట్ టికెట్ల విధానం, థర్మల్ స్క్రీనింగ్, అన్న ప్రసాద భవనం ప్రారంభం వంటి అంశాలపై అంచనాకు వచ్చాం. దర్శన విధి విధానాలను నిర్ణయించి 8వ తేది నుండి దర్శనాలు ప్రారంభిస్తాం. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.
  • తాడేపల్లి : తాడేపల్లి లో గల ఉండవల్లి సెంటర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేట లో ఈరోజు 4 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు. కాగా ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లి లో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటేషన్ పనులను చేస్తున్నారు.

Prajyan Ojha Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్…

భారత స్టార్ బౌలర్ ప్రగ్యాన్ ఓజా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు భావోద్వేగమైన ట్వీట్ ద్వారా ప్రకటించాడు.
Indian Spinner Retirement, Prajyan Ojha Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్…

Indian Spinner Retirement: భారత స్టార్ బౌలర్ ప్రగ్యాన్ ఓజా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు భావోద్వేగమైన ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు. తన కెరీర్ అద్భుతంగా ఉండటంతో సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. 2008లో వన్డే అరంగేట్రం చేసి ఓజా.. 2009లో శ్రీలంకపై మొదటి టెస్టు ఆడాడు. ప్రగ్యాన్ ఓజా భారత్ తరపున 24 టెస్టులు, 18 వన్డేలు ఆడి 113 వికెట్లు పడగొట్టాడు. అంతేకాక ఐసీసీ ర్యాంకింగ్‌లో ఐదో స్థానానికి కూడా చేరుకున్నాడు.

Also Read: IPL All Stars Match End Of The Tournament

అటు ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఓజా పర్పుల్ క్యాప్ అందుకున్న మొదటి స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా, 2019 వరకు దేశవాళీ మ్యాచులు ఆడిన అతడు 2013లో సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ మ్యాచ్‌తో ఓజా చివరిసారిగా దేశానికీ ప్రాతినిధ్యం వహించాడు.

Also Read: Virat Kohli Worst Record

Also Read: Mayank Agarwal Achieved Rare Feat In Tests

Also Read: T20 Women’s World Cup India Stellar Show In Opening Match

Related Tags