ఇస్రో రాకెట్లకు బూస్ట్… స్పేస్ టెక్నాలజీకి హైప్ ..

INDIAN SPACE STARTS-UPS, ఇస్రో రాకెట్లకు బూస్ట్… స్పేస్ టెక్నాలజీకి హైప్ ..

రెండో చంద్రయాన్ మిషన్ కి సిధ్ధ[పడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో .. ఇక దేశంలో తయారయ్యే రాకెట్లపై ‘ గుత్తాధిపత్యం ‘ వహించబోతోంది. ఇదే విషయాన్ని గమనించి..ఇండియాలో స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ లు మెల్లగా వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అంతరిక్ష ‘ రేస్ ‘ లో పెట్టుబడులు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్, నాన్-టాక్సిక్ కెమికల్స్ ను ఉపయోగించి శాటిలైట్లను కక్ష్యలోకి ప్రయోగించేందుకు బెలాట్రిక్స్ (బెంగుళూరు) సంస్థ తొలి అడుగు వేసింది. ఈ దిశగా కొంతమంది ఇన్వెస్టర్ల గ్రూపు నుంచి తాము సుమారు 30 లక్షల డాలర్లను సమీకరించినట్టు ఈ సంస్థ కో-ఫౌండర్ యషాస్ కరణం తెలిపారు. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ సహా హీరో మోటార్ కార్పొరేషన్ అధినేత సుమన్ కాంత్ ముంజాల్, మరో ఏడుగురు పెట్టుబడిదారులు అంతరిక్ష టెక్నాలజీపై ఆసక్తి చూపుతున్నారు. వీటిలో ముంబైకి చెందిన కవా స్పేస్ సంస్థ ముఖ్యమైనదని అంటున్నారు. భూఉపరితలంలోని మారుమూలలను సైతం ఫోటోలు తీయగలిగే ఉపగ్రహాలను డిజైన్ చేసి, ఆపరేట్ చేయగల ఈ సంస్థ.. భారీగా ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. స్పేషియేల్ ఇన్వెస్ట్ అనే మరో స్టార్టప్.. మేనేజింగ్ పార్ట్ నర్ విశేష్ రాజారామ్.. తాము త్వరలో పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. ఉపగ్రహాలను, రాకెట్లను, సపోర్ట్ సిస్టంలను అభివృద్ది పరచి.. ప్రయోగించగల మొత్తం 12 సంస్థల్లో బెలాట్రిక్స్, కవాస్పేస్ ముందంజలో ఉన్నాయి. విరాళాల సేకరణకోసం ఇవి చేస్తున్న కృషి.. ఇండియాలో ప్రయివేటు స్పేస్ ఇన్వెస్టిమెంట్లను ఆకర్షించడానికి జరుగుతున్న ప్రయత్నంలో పెద్ద ముందడుగని పేర్కొంటున్నారు.

గత ఏడాది నుంచి మొదలుపెట్టి.. 2030 వరకు చిన్న శాటిలైట్లను లాంచ్ చేసే అవకాశం ఉందని ఫ్రాస్ట్ అండ్ సలివాన్ ఎస్టిమేట్స్ కన్సల్టింగ్ సంస్థ తెలిపింది. ఇదే జరిగితే రోదసిలో పెద్ద శాటిలైట్ల విప్లవమే రావచ్ఛునని అంటున్నారు. ఇదిలాఉండగా..స్పేస్ లాకు సంబంధించిన బిల్లును ఈ ఏడాది పార్లమెంటు ఆమోదించగలదని దేశంలోని పలు స్టార్టప్ సంస్థలు ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో..
స్పేస్ యాక్టివిటీస్ బిల్లు ముసాయిదాలో చేయగల మార్పులు, చేర్పులకు అనువుగా స్టాక్ హోల్డర్ల నుంచి సూచనలు, సలహాలను ప్రధాని మోదీ ప్రభుత్వం కోరింది. బహుశా ఇది పూర్తి బిల్లు రూపం దాల్చిన పక్షంలో… దీన్ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *