మార్కెట్లపై అమ్మకాల ఎఫెక్ట్

స్టాక్ మార్కెట్లపై అమ్మకాల పిడుగు పడింది. ఫ్రైడే సెంటిమెంట్ కలిసొస్తుందని అనుకుంటే కుప్పకూలాయి. నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. ఈ రోజు మిశ్రమ స్పందన వస్తుందనుకున్న వారికి  చుక్కులు కనిపించాయి.

మార్కెట్లపై అమ్మకాల ఎఫెక్ట్
Follow us

|

Updated on: Sep 04, 2020 | 10:20 AM

ఇండియన్ స్టాక్ మార్కెట్లపై అమ్మకాల పిడుగు పడింది. ఫ్రైడే సెంటిమెంట్ కలిసొస్తుందని అనుకుంటే కుప్పకూలాయి. నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. ఈ రోజు మిశ్రమ స్పందన వస్తుందనుకున్న వారికి  చుక్కులు కనిపించాయి. యూస్ మార్కెట్ల పతనం.. మన దేశీయ మార్కెట్లపై కనిపించింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం కుప్పకూలాయి.

సెన్సెక్స్‌ 427 పాయింట్లు పడిపోయి 38,563కు చేరగా.. నిఫ్టీ 125 పాయింట్లు కోల్పోయి 11,402.45 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల ఆకాశమే హద్దుగా సరికొత్త రికార్డులను తాకుతున్న అమెరికా టెక్నాలజీ స్టాక్స్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఇంత ఒత్తిడిలోనూ ఒకే ఒక్క కంపెనీ లాభాలను మూటగట్టుకుంది. డెరివేటివ్స్‌లోనూ టొరంట్‌ ఫార్మా 0.2 శాతం బలపడి.. కొంత ఉత్సాహంగా సాగుతోంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1380 నష్టపోగా.. 363 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి