ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఈ కార్డుతో ఉచితంగా రైల్ టికెట్లు.!

ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. ఉచితంగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే మొత్తం ఫ్రీగా కాదండోయ్.!

ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఈ కార్డుతో ఉచితంగా రైల్ టికెట్లు.!
Follow us

|

Updated on: Oct 28, 2020 | 2:51 PM

IRCTC SBI RuPay Card: ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. ఉచితంగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే మొత్తం ఫ్రీగా కాదండోయ్.! దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ఐఆర్‌సీటీసీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సంయుక్తంగా ‘ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే కార్డు’ను తీసుకొచ్చాయి. ఈ కార్డుతో ప్రయాణీకులు పలు నిబంధనల మేరకు ఉచితంగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే.!

ఈ కార్డు ద్వారా ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లు బుక్ చేసుకునేవారికి 10 శాతం రివార్డు పాయింట్లు పొందుతారు. అంటే 1 రివార్డు పాయింట్.. ఒక రూపాయితో సమానం అనమాట. అలా వచ్చిన రివార్డు పాయింట్లతో వినియోగదారుడు.. తనకు/కుటుంబసభ్యులకు/ఫ్రెండ్స్‌కు ఉచితంగా రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.  అంతేకాదు మొదటి 45 రోజుల్లో రూ. 500 అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిపిన ప్రయాణీకుడికి రూ. 350 బోనస్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. అలాగే ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారి చెల్లించాల్సిన ఛార్జీల్లో 1 శాతం తగ్గింపు కూడా ఉంటుంది. ఇక ఈ ‘ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే కార్డు’ను 2021 మార్చి 31 వరకు ఎలాంటి రుసుము లేకుండా పొందవచ్చు.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..