పట్టాలెక్కిన సూపర్‌ అనకొండ గూడ్స్

భారతీయ రైల్వే శాఖ మరో ఘనత సాధించింది. 177 వ్యాగన్లతో కూడిన 2.8 కిలోమీటర్ల పొడవైన గూడ్సు రైలును పట్టాల మీద పరుగులు పెట్టించింది. సూపర్‌ అనకొండగా పిలిచే ఈ రైలు ఒడిశా బిలాస్‌పుర్‌ డివిజన్‌లోని లజ్‌కురా-రవుర్కెల మధ్య పరుగులు తీసింది. దీనిని మూడు రైళ్ల కూర్పుతో రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

పట్టాలెక్కిన సూపర్‌ అనకొండ గూడ్స్
Follow us

|

Updated on: Jul 03, 2020 | 8:14 PM

భారతీయ రైల్వే శాఖ మరో ఘనత సాధించింది. 177 వ్యాగన్లతో కూడిన 2.8 కిలోమీటర్ల పొడవైన గూడ్సు రైలును పట్టాల మీద పరుగులు పెట్టించింది. సూపర్‌ అనకొండగా పిలిచే ఈ రైలు ఒడిశా బిలాస్‌పుర్‌ డివిజన్‌లోని లజ్‌కురా-రవుర్కెల మధ్య పరుగులు తీసింది. దీనిని మూడు రైళ్ల కూర్పుతో రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

మూడు రైళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా అమర్చి 15వేల టన్నుల బొగ్గును ఒకేసారి రవాణా చేసేలా తయారు చేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ప్యాసింజర్‌ రైళ్లు బంద్‌ కావడంతో సరకు రవాణా వాహనాలను సరికొత్త విధానంలో పరుగులు తీయించడానికి రైల్వేశాఖ ప్రాధాన్యం ఇస్తోంది. పరిమిత సంఖ్యలో రవాణా వ్యవస్థ ఉండడంతో సరుకుల రవాణాను ఏకకాలం చేరవేసేందుకు ఈ రైలు ఉపయోగపడుతుందని భావిస్తోంది రైల్వే శాఖ.