రైల్వే చ‌రిత్ర‌లోనే తొలిసారి..100 శాతం సమయపాలన న‌మోదు

భారతీయ రైల్వే అరుదైన‌ ఘనతను సాధించింది. రైల్వే చరిత్రలో తొలిసారిగా అన్ని రైళ్లు జూలై 1 న(బుధవారం) 100% సమయపాలన పాటించాయ‌ని భారత రైల్వే పేర్కొంది.

రైల్వే చ‌రిత్ర‌లోనే తొలిసారి..100 శాతం సమయపాలన న‌మోదు
Follow us

|

Updated on: Jul 02, 2020 | 2:44 PM

భారతీయ రైల్వే అరుదైన‌ ఘనతను సాధించింది. రైల్వే చరిత్రలో తొలిసారిగా అన్ని రైళ్లు జూలై 1 న(బుధవారం) 100% సమయపాలన పాటించాయ‌ని భారత రైల్వే పేర్కొంది. బుధ‌వారం నడిచిన‌ 201 రైళ్లు నిర్దేశించిన స‌మ‌యానికి గ‌మ్య‌స్థానాల‌కు చేరుకున్నాయ‌ని తెలిపింది. భారతీయ రైల్వే చరిత్రలో ఇలా జరగడం ఇదే మొద‌టిసారి.

ఇక‌ ఇదే ఏడాది జూన్​ 23 ఈ రికార్డు 99.54 శాతంగా న‌మోదైంది. ఒకే ఒక్క ట్రైన్‌ ఆలస్యంగా న‌డ‌వ‌డం వ‌ల్ల‌.. అప్పుడు 100 శాతం సమయపాలన రికార్డును అందుకోలేకపోయింది భార‌తీయ రైల్వే శాఖ. కాగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో, అన్ని సాధారణ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన‌ భారతీయ రైల్వే అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల‌ను మాత్ర‌మే న‌డుపుతుంది.