భారత సంతతి డాక్టర్ కు అరుదైన గౌరవం..!

బ్రిటన్ లో నివాసముంటున్న భారత సంతతికి చెందిన డాక్టర్ జాజిని వర్గీస్‌కు అరుదైన గౌరవం దక్కింది.

భారత సంతతి డాక్టర్ కు అరుదైన గౌరవం..!
Follow us

|

Updated on: Oct 20, 2020 | 5:16 PM

బ్రిటన్ లో నివాసముంటున్న భారత సంతతికి చెందిన డాక్టర్ జాజిని వర్గీస్‌కు అరుదైన గౌరవం దక్కింది. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్(జేసీఐ) స్వచ్ఛంద సంస్థ.. డాక్టర్ జాజిని వర్గీస్‌ను ఔట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్‌గా ఎంపిక చేసింది. రొమ్ము కాన్సన్‌ నిర్ధారణ, చికిత్సపై ఆమె చేసిన కృషికి గానూ ఈ గౌరవం దక్కింది. ఈ ఏడాది నవంబర్‌లో జపాన్‌లోని యోకోహామాలో జేసీఐ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో డాక్టర్ జాజిని వర్సీస్ అవార్డును అందుకోనున్నారు. కాగా.. ఏటా వివిధ రంగాల్లో అత్యత్తమ ప్రతిభ చూపిన 40 ఏళ్లలోపు వ్యక్తులను జేసీఐ ఎంపిక చేసి ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల.. 39ఏళ్ల జాజిని వర్గీస్ సంతోషం వ్యక్తం చేశారు.