భారత సంతతి యుకే మంత్రి అలోక్ శర్మకు కరోనా పరీక్ష..?

యూకేలో భారత సంతతికి చెందిన కేబినెట్ మంత్రి అలోక్ శర్మకు వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. బుధవారం యూకే పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలు తెలియాల్సి ఉంది

భారత సంతతి యుకే మంత్రి అలోక్ శర్మకు కరోనా పరీక్ష..?
Follow us

|

Updated on: Jun 04, 2020 | 4:55 PM

కరోనా దెబ్బకి దేశాధినేతలు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని కరోనా బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా యూకేలో భారత సంతతికి చెందిన కేబినెట్ మంత్రి అలోక్ శర్మకు వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. బుధవారం యూకే పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆస్పత్రికి తరలించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అలోక్ శర్మకు కొవిడ్ -19 పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అలోశ్ శర్మ తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే, పార్లమెంట్‌ సమావేశాలకు ఎంపీలు హాజరయ్యేందుకు ఇటీవల ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో అనేక మంది ఎంపీలతో కలిసి అలోక్ శర్మ పాల్గొన్నారు. దీంతో అలోక్ శర్మ కరోనా పరీక్ష ఫలితాల కోసం పార్లమెంట్ మొత్తం వేచి చూస్తోంది. అలోక్ శర్మకి పాజిటివ్ వస్తే తమ పరిస్థితి ఏంటన్న టెన్షన్ మొదలైంది.