అరేబియా సముద్రంలో కూలిన మిగ్‌-29కే విమానం.. ఒకరు మృతి.. మరొకరి కోసం గాలిస్తున్న అధికారులు

అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం కూలిపోయింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సముద్రంలో పడిపోయారు.

అరేబియా సముద్రంలో కూలిన మిగ్‌-29కే విమానం.. ఒకరు మృతి.. మరొకరి కోసం గాలిస్తున్న అధికారులు
Follow us

|

Updated on: Nov 27, 2020 | 10:24 AM

అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం కూలిపోయింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సముద్రంలో పడిపోయారు. అందులో ఒకరి ఆచూకీ లభించింది.. మరొకరి కోసం నేవీ అధికారులు  వెతుకుతున్నారు.

రోజువారీ శిక్షణలో భాగంగా దక్షిణ గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్సా నుంచి బయల్దేరిన మిగ్‌-29కే విమానం నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో అరేబియా సముద్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు.

ఈ ఏడాది మిగ్‌-29కే విమానం కుప్పకూలడం ఇది మూడోసారి కావడం విశేషం. గత ఫిబ్రవరిలో గోవా తీరంలో మిగ్‌-29 కే శిక్షణ విమానం కూలిపోయింది. అయితే అందులో ఉన్న పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. కానీ ఈ ప్రమాదంలో పైలట్ తప్పించుకోలేక పోయారు. అది సముద్రం కావడంతో సురక్షితంగా బడటపడలేక పోయాడు.