భారతీయ మీడియా విశ్వ వ్యాప్తం కావాలి, ప్రధాని మోదీ

భారతీయ మీడియా ఖండాంతరాలు దాటి వెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది విశ్వ వ్యాప్తం కావాలి అన్నారు. నేటి యువత పుస్తకాలు ఎక్కువగా చదవాలని, ఈ టెక్స్ట్ , ట్వీట్, 'గూగుల్ గురు' పాపులర్ అవుతున్న తరుణంలో...

భారతీయ మీడియా విశ్వ వ్యాప్తం కావాలి, ప్రధాని మోదీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 08, 2020 | 2:26 PM

భారతీయ మీడియా ఖండాంతరాలు దాటి వెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది విశ్వ వ్యాప్తం కావాలి అన్నారు. నేటి యువత పుస్తకాలు ఎక్కువగా చదవాలని, ఈ టెక్స్ట్ , ట్వీట్, ‘గూగుల్ గురు’ పాపులర్ అవుతున్న తరుణంలో యువత సీరియస్ నాలెడ్జ్ (విజ్ఞాన సముపార్జన) కి దూరం కారాదని ఆయన చెప్పారు. జైపూర్ లో మంగళవారం ‘పత్రికా గ్రూప్’ చైర్మన్ గులాబీ కొఠారీ రాసిన రెండు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. భారతీయ ఉత్పత్తులతో బాటు భారతీయ వాణి కూడా ప్రపంచ వ్యాప్తమవుతోందని,. ప్రపంచ సంస్థల్లో మన దేశం తన ఉనికిని ఘనంగా చాటుకుంటోందని మోదీ తెలిపారు.

అన్ని దేశాలూ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి.. భారతీయ సమాచారాన్నిఅవి  శ్రధ్దగా తెలుసుకుంటున్నాయి .. అందువల్లే మన దేశ మీడియా గ్లోబల్ గా ఎదగాలి అని ప్రధాని పేర్కొన్నారు. కరోనా వైరస్ పాండమిక్ పై ప్రజల్లో అవగాహనను పెంపొందించడంలో మీడియా అసాధారణ రీతిలో ప్రజలకు సేవలందిస్తోందని మోదీ ప్రశంసించారు.