మామిడిపండ్లు దొంగలించినందుకు దేశ బహిష్కరణ

అరబ్ కంట్రీస్‌లో న్యాయవ్యవస్థ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చిన్న, చిన్న తప్పలకు కూడా అత్యంత కఠినతరమైన శిక్షలు వేస్తూ క్రైమ్ రేట్ పెరగకుండా అదుపుచేస్తూ ఉంటారు. తాజాగా అందుకు మరో సంఘటన ఉదాహారణగా నిలిచింది. రెండేళ్ల క్రితం రెండు మామిడిపండ్లు దొంగలించినందుకు గానూ ఓ భారత కార్మికుడికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ న్యాయస్థానం తీవ్రమైన శిక్ష విధించింది. అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన ఓ 27ఏళ్ల వ్యక్తి దుబాయి […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:26 pm, Tue, 24 September 19

అరబ్ కంట్రీస్‌లో న్యాయవ్యవస్థ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చిన్న, చిన్న తప్పలకు కూడా అత్యంత కఠినతరమైన శిక్షలు వేస్తూ క్రైమ్ రేట్ పెరగకుండా అదుపుచేస్తూ ఉంటారు. తాజాగా అందుకు మరో సంఘటన ఉదాహారణగా నిలిచింది. రెండేళ్ల క్రితం రెండు మామిడిపండ్లు దొంగలించినందుకు గానూ ఓ భారత కార్మికుడికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ న్యాయస్థానం తీవ్రమైన శిక్ష విధించింది. అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన ఓ 27ఏళ్ల వ్యక్తి దుబాయి ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ప్రయాణికుల లగేజీని కంటెయినర్‌ నుంచి కన్వేయర్‌ బెల్ట్‌పైకి ఎక్కించడం.. అక్కడి నుంచి దించడం అతడి పని. అయితే 2017 ఆగస్టు 11న ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహిస్తున్న అతడు ప్రయాణికులకు చెందిన ఓ పండ్ల బాక్సు నుంచి రెండు మామిడిపండ్లను దొంగలించాడు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణలో అతడు దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఆ సమయంలో తాను చాలా ఆకలిగా ఉన్నానని, దాహం కూడా ఎక్కువగా ఉండటంతో పండ్లను తీసుకున్నానని చెప్పాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఈ కేసును విచారించిన ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ కోర్టు సోమవారం తుదితీర్పు వెల్లడించింది. అతడికి 5000 దిర్హామ్‌(యూఏఈ కరెన్సీ)ల జరిమానాతో పాటు దేశ బహిష్కరణ విధించింది. ఈ తీర్పుపై అతడు 15 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకునే వీలుంటుంది.