కరోనాపై పోరులో సరికొత్త ఆవిష్కరణ.. భారత సంతతి శాస్త్రవేత్త ఘనత..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త

కరోనాపై పోరులో సరికొత్త ఆవిష్కరణ.. భారత సంతతి శాస్త్రవేత్త ఘనత..!
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 5:03 AM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్‌ మనుప్రకాశ్‌ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. విద్యుత్‌ అవసరం లేకుండా పనిచేయగల సెంట్రీఫ్యూజ్‌(అపకేంద్ర యంత్రం)ను మనుప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ బయో ఇంజనీరింగ్‌ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది.

కోవిద్-19 నిర్ధారణకు లాలాజల(ఉమ్మి) నమూనాలతో పరీక్షలు చేసేందుకు వాడే యంత్రాల్లో ప్రస్తుతం విద్యుత్‌ ఆధారిత సెంట్రీఫ్యూజ్‌లు ఉన్నాయి. వీటి ధర వందల డాలర్లలో ఉంటుంది. కానీ మనుప్రకాశ్‌ అండ్‌ టీం రూపొందించిన సెంట్రీఫ్యూజ్‌కు కరెంటు అవసరం లేదు. ధర కూడా చాలా తక్కువ. దాన్ని నేరుగా ‘హ్యాండీఫ్యూజ్‌’ పరికరంలో అమర్చి.. దానికి ఉండే హ్యాండిల్‌ను చేతితో తిప్పుతుంటే సెంట్రీఫ్యూజ్‌ వేగంగా తిరుగుతూ లాలాజల నమూనాల్లోని భాగాలను అపకేంద్ర బలంతో వేరుచేస్తుంది.

కాగా.. హ్యాండీఫ్యూజ్‌ పరికరంలో ఒక్క సెంట్రీఫ్యూజ్‌ను అమర్చడానికి రూ.380 కంటే తక్కువే ఖర్చవుతుందని వెల్లడించారు. మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షలకు ఈ ఆవిష్కరణ ఊతమిస్తుందని మనుప్రకాశ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించిన మనుప్రకాశ్‌.. ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్‌, అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎం.ఎస్‌, పీహెచ్‌డీ చేశారు.

సెరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
సెరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
డల్లాస్ మెగా ఫాన్స్ సంబరాలు..
డల్లాస్ మెగా ఫాన్స్ సంబరాలు..
జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్
జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్
సిద్ధార్థ్, అదితి పెళ్ళిలో బిగ్ ట్విస్ట్..
సిద్ధార్థ్, అదితి పెళ్ళిలో బిగ్ ట్విస్ట్..
ఈ పండ్లు తింటే.. పాడైపోయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. పాడైపోయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు వైసీపీకి బ్రహ్మరథం
రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు వైసీపీకి బ్రహ్మరథం
కొత్త జంటకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సీఎం జగన్‌.. వీడియో
కొత్త జంటకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సీఎం జగన్‌.. వీడియో