జైషే మహ్మద్ శిభిరంపై దాడి నిజమే.. ఒప్పుకున్న మసూద్ అజర్ సోదరుడు

పుల్వామా దాడితో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సర్జికల్ స్ట్రైక్-2 చేపట్టింది. భారత వాయుసేన మిరాజ్ విమానాలతో పాక్‌లోని బాలాకోట్ లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నేలమట్టం చేసింది. కానీ భారత్‌ దాడి చేసినట్లుగా చెబుతున్న బాలాకోట్‌ ప్రాంతంలో ఉగ్ర స్థావరాలు ఏమీ లేవంటూ ఇన్ని రోజులు పాక్‌ చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ మసూద్‌ అజార్‌ సోదరుడు మౌలానా అమర్‌ మాత్రం భారత్‌ యుద్ధ విమానాలతో దాడి చేసినట్లుగా […]

జైషే మహ్మద్ శిభిరంపై దాడి నిజమే.. ఒప్పుకున్న మసూద్ అజర్ సోదరుడు
Follow us

| Edited By:

Updated on: Mar 03, 2019 | 2:18 PM

పుల్వామా దాడితో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సర్జికల్ స్ట్రైక్-2 చేపట్టింది. భారత వాయుసేన మిరాజ్ విమానాలతో పాక్‌లోని బాలాకోట్ లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నేలమట్టం చేసింది. కానీ భారత్‌ దాడి చేసినట్లుగా చెబుతున్న బాలాకోట్‌ ప్రాంతంలో ఉగ్ర స్థావరాలు ఏమీ లేవంటూ ఇన్ని రోజులు పాక్‌ చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ మసూద్‌ అజార్‌ సోదరుడు మౌలానా అమర్‌ మాత్రం భారత్‌ యుద్ధ విమానాలతో దాడి చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని అంగీకరిస్తున్నట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్‌ బయటకు వచ్చింది. దీంతో పాక్ ఇరకాటంలో పడింది. అంతేకాక భారత్‌ వింగ్‌ కమాండర్ అభినందన్‌ వర్ధమాన్‌ను విడుదల చేయడాన్ని కూడా అమర్‌ విమర్శించాడు.

భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 దాడిలో 350 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. అంతర్జాతీయంగా ఈ దాడులు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మసూద్ అజర్ సోదరుడు మౌలానా అమర్ మాట్లాడిన ఆడియోలో.. భారత యుద్ధ విమానాలు ఐఎస్ఐ స్థావరాలు, ఆర్మీ పోస్టుల జోలికి వెళ్లకుండా బాలాకోట్ లో ఉన్న జైషే మహ్మద్ శిబిరంపైనే దాడులు చేశాయని వేరొకరితో చెబుతున్నట్టుగా ఉంది. అంతేకాదు, భారత వింగ్ కమాండర్ ను విడుదల చేసినందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర విమర్శలు చేయడం కూడా ఆ ఆడియో రికార్డింగ్ లో వెల్లడైంది. కానీ పాక్‌ మాత్రం బాలాకోట్‌లో ఎటువంటి ఉగ్ర శిక్షణా శిబిరం లేదని ఇప్పటికే చెప్పింది.. భారత్ వైమానిక దళం వేసిన బాంబుల కారణంగా చెట్లు కూలిపోయాయని పాక్ ఆరోపిస్తోంది.