భారత్ తో చైనా కయ్యం ! లడఖ్ లో ఏం జరుగుతోంది ?

లడఖ్ లో వాస్తవాధీన రేఖ పొడవునా క్రమంగా భారత్-చైనా మధ్య 'నిప్పు' రాజుకుంటోంది. భారత ఆర్మీకి చెందిన పెట్రోలింగ్ బృందంలో కొంతమందిని, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు విభాగంలోని మరికొంతమంది జవాన్లను చైనా దళాలు ఇటీవల నిర్బంధించి..

భారత్ తో చైనా కయ్యం ! లడఖ్ లో ఏం జరుగుతోంది ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 11:39 AM

లడఖ్ లో వాస్తవాధీన రేఖ పొడవునా క్రమంగా భారత్-చైనా మధ్య ‘నిప్పు’ రాజుకుంటోంది. భారత ఆర్మీకి చెందిన పెట్రోలింగ్ బృందంలో కొంతమందిని, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు విభాగంలోని మరికొంతమంది జవాన్లను చైనా దళాలు ఇటీవల నిర్బంధించి.. ఆ తరువాత విడుదల చేసినట్టు తెలిసింది. అంతకుముందు ఉభయ పక్షాల మధ్య కొద్దిసేపు ఘర్షణ కూడా జరిగిందట. రెండు పక్షాల కమాండర్ల మధ్య బోర్డర్ లో సమావేశం జరిగిన అనంతరం ఉద్రిక్తత తగ్గి మళ్ళీ సాధారణ పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. లడఖ్ లోని పాంగాంగ్ సరస్సు సమీపంలో ఈ వారారంభంలో జరిగిన ఘటనలను భారత దళాలు ప్రధానమంత్రి కార్యాలయానికి వివరించాయి. గత బుధవారం ఇండియన్ జవాన్లకు, చైనా సైనికులకు మధ్య ఘర్షణ జరిగిన అనంతరం మనవాళ్లను కొందరిని వారు నిర్బంధంలోకి తీసుకున్నారని, కొంతసేపటికి వదిలివేశారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత జవాన్ల నుంచి చైనీయులు ఆయుధాలు కూడా లాక్కున్నట్టు ఆయన చెప్పారు.

భారత భూభాగంలోకి చైనా సైనికులు చొరబడ్డారని, పాంగాంగ్ లేక్ లో మోటార్ బోట్లతో ‘గస్తీ’ తిరిగారని కేంద్రానికి సమాచారం కూడా అందింది. ‘అది నిజానికి పెద్ద ఘటనే ! ప్రస్తుతానికి పరిస్థితి సద్దు మణిగింది. అలా అని ఇది ఇంతటితో సమసిపోతుందనుకోవడం పొరబాటే అవుతుంది’ అని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. లడఖ్ లోని గల్వాన్ ప్రాంతం పొడవునా వేర్వేరు చోట్ల చైనా సైనికులు టెంట్లు (గుడారాలు) వేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కి ఎప్పటికప్పుడు తాము సమాచారాన్ని తెలియజేస్తున్నట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెలారంభంలో లడఖ్ తూర్పు ప్రాంతంలోని వివాదాస్పద గగనతలంలో చైనా హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టిన విషయాన్ని కూడా ఇవి ప్రస్తావించాయి.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు